నాచురల్ స్టార్
నాని ఈ సంవత్సరం
దసరా మూవీ తో అదిరిపోయే రేంజ్ పాన్
ఇండియా సక్సెస్ ను అందుకున్నాడు. ఇక
దసరా లాంటి భారీ
సక్సెస్ తర్వాత ఈ నటుడు హాయ్
నాన్న అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ
మూవీ ని మొదట
డిసెంబర్ 21 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ
మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. ఇక ఆ తర్వాత
ప్రభాస్ హీరోగా రూపొందిన సలార్
మూవీ ని
డిసెంబర్ 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఆ
మూవీ బృందం ప్రకటించడంతో ఆ సినిమాతో పోటీ అవసరం లేదు అని భావించిన ఈ
మూవీ మేకర్స్ ఈ సినిమాను
డిసెంబర్ 22 వ తేదీన కాకుండా
డిసెంబర్ 7 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ
మూవీ బృందం వారు ఈ
సినిమా ప్రమోషన్ లను కూడా భారీగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించారు.
ఈ
మూవీ మేకర్స్ ఈ సినిమాను "యుఎస్ఎ" లో ప్రత్యంగిరా సినిమాస్ ... ఏ ఏ క్రియేషన్స్ ఫణి ముత్యాల సంస్థలు విడుదల చేయబోతున్నట్లు అలాగే ఈ
మూవీ ని "యుఎస్ఎ" లో
డిసెంబర్ 6 వ తేదీనే ప్రీమియర్స్ ప్రదర్శించబోతున్నట్లు ఈ
మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ రెండు సంస్థలు కూడా ఈ సినిమాలు భారీ ఎత్తున "యూఎస్ఏ" లో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ
మూవీ ని తెలుగు ,
తమిళ ,
కన్నడ మలయాళ ,
హిందీ భాషలలో పాన్
ఇండియా మూవీ గా విడుదల చేయనున్నారు. మరి ఈ మూ వీతో
నాని ఇండియా వ్యాప్తంగా ఏ స్థాయి క్రేజ్ ను సాధిస్తాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.