టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సమంత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన నటన తన మంచి మనసుతో ఎందరినో తన అభిమానులను చేసుకుంది. ఇక గత కొంతకాలంగా సమంత అనారోగ్యం కారణంగా బాధపడుతున్న సంగతి తెలిసిందే. గత కొంత కాలం పాటు సినిమాల కి బ్రేక్ కూడా ఇచ్చింది సమంత. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం హవా కొనసాగిస్తూనే ఉంది. సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో ఎప్పటికప్పుడు ముచ్చటిస్తోంది సమంత. ఈ నేపథ్యంలోనే తాజాగా సమంత తన
సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ ని తన అభిమానులతో షేర్ చేయడం జరిగింది. సమంతా గత కొన్ని రోజులుగా మయోసైటీస్ అనే ఒక అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఎవరి సహాయం లేకపోయినా కూడా ఒంటరిగానే పోరాడుతూ సినిమాలతో పాటు జీవితంలో కూడా అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంది. మళ్ళీ ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా ఆ వ్యాధి నుండి బయటపడుతోంది. ఈ క్రమంలోనే ఈ అనారోగ్యం కారణంగా కొన్ని ఆహారపు అలవాట్లను సమంతా మార్చుకోవాల్సి వచ్చింది. తనకు ఎంతో ఇష్టమైన ఫుడ్ ను కూడా తినట్లేదు సమంత.
ముఖ్యంగా బ్రెడ్ ను పూర్తిగా తినడం మానేసిందట. ఈ నేపథ్యంలోనే దాదాపుగా ఏడాది తర్వాత మళ్లీ సమంత ఇప్పుడు తనకి చాలా ఇష్టమైన బ్రెడ్ ను బటర్ తి కలిపి తింటున్నట్లుగా తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టి తన అభిమానులతో పంచుకుంది. ఒక సంవత్సరం నాలుగు నెలల తర్వాత బ్రెడ్ ముక్కల్ని తింటున్నాను అంటూ ఆ పోస్ట్ లో భాగంగా పేర్కొంది సమంత. దీంతో సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇక ఇటీవల ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత ఈ సినిమా తర్వాత ఏడాది పాటు తన అనారోగ్యం కారణంగా సినిమాలకి బ్రేక్ ఇచ్చింది..!!