సల్మాన్ ఖాన్ ను కలవర పెడుతున్న సెటైర్లు !
అయితే లేటెస్ట్ గా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కు మిశ్రమ స్పందన రావడమే కాకుండా ఆ ట్రైలర్ పై వస్తున్న సెటైర్లు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తీసిన నిర్మాతలకు కలవరపాటుకు గురి చేస్తున్నట్లు టాక్. ఈ మూవీ నిర్మాతలు యష్ రాజ్ ఫిలిమ్స్ ‘స్పై’ మూవీ కథను తిప్పితిప్పి మళ్ళీ సీక్వెల్స్ గా తీసి బోర్ కొట్టిస్తున్నారని సగటు సినిమా ప్రేక్షకులు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
‘పఠాన్’ లో జాన్ అబ్రహం పాత్రను ‘టైగర్ 3’ లో ఇమ్రాన్ హష్మీగా మార్చారా అంటూ కొందరు జోక్ చేస్తున్నారు. దేశద్రోహం కేసు మీద హీరో అవమానాల పాలు కావడం ఎప్పుడో దేవానంద్ నటించిన ‘జమానా’ నుంచి ‘జవాన్’ వరకు ఇలాంటి పాత కథలు చాల వచ్చాయి కదా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే యాక్షన్ విజువల్స్ పరంగా భారీతనం కనిపిస్తున్నప్పటికీ కథలో కొత్త దనం కనిపించడం లేడు అంటూ ఈ ట్రైలర్ పై మరికొందరు అభిప్రాయ పడుతున్నారు.
హీరోయిన్ కత్రినా కైఫ్ విలన్ విలన్స్ తో టవల్ చుట్టుకుని చేసిన ఫైట్ లాంటి సీన్స్ చాల సినిమాలలో వచ్చాయి కదా అంటూ మరికొందరి అభిప్రాయం. ఇక ఈ ట్రైలర్ చూసిన వారు ఈమూవీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయం పై కూడ పెదవి విరుస్తున్నారు. లేటెస్ట్ గా విడులైన ‘జవాన్’ మూవీ కథ ఛాయలు ‘టైగర్ 3’ లో కనిపించే ఆస్కారం ఉంది అంటూ మరికొందరి అభిప్రాయం.. రాబోతున్న దీపావళి సల్మాన్ ఖాన్ కు రాబోతున్న దీపావళి ఎలాంటి ఫలితాన్ని అంధిస్తుందో చూడాలి