"కీడా కోలా" మ్యూజిక్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాలెంటెడ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో తరుణ్ భాస్కర్ ఒకరు. ఈయన తన కెరియర్ లో ఇప్పటి వరకు రెండు సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించాడు. ఆ రెండు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఈ దర్శకుడు మొదటగా పెళ్లి చూపులు మూవీ కి దర్శకత్వం వహించాడు. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది మూవీ.కి దర్శకత్వం వహించాడు. ఇలా రెండు మూవీ లకు దర్శకత్వం వహించి రెండు మూవీ లతో కూడా మంచి సక్సెస్ లను అందుకున్న ఈయన ఆ తర్వాత కాలంలో సినిమాలకు దర్శకత్వం వహించడం కంటే కూడా సినిమాల్లో నటించడానికి ప్రముఖ ప్రాధాన్యతో ఇస్తూ వచ్చాడు. అందులో భాగంగా ఇప్పటికే అనేక సినిమాలలో నటించి నటుడిగా కూడా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఇకపోతే తాజాగా తరుణ్ "కీడా కోలా" అనే క్రైమ్ కామెడీ జోనర్ మూవీ కి దర్శకత్వం వహించాడు.
 


ఈ మూవీ లో ఈయన కూడా ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ సినిమాను అక్టోబర్ 27 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ రోజు ఉదయం 11 గంటలకు ఈ సినిమా ట్రైలర్ ను కూడా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ ను కూడా ప్రకటించారు. తాజాగా ఈ చిత్ర బృందం వారు ఈ సినిమా యొక్క మ్యూజిక్ హక్కులను "సరిగమ" సంస్థ దక్కించుకున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: