సలార్ కధ గురించి లీకులు !

Seetha Sailaja
‘ఆదిపురుష్’ ఆశించిన స్థాయిలో విజయవంతం కాకపోవడంతో ప్రభాస్  అభిమానులు రాబోతున్న రెండు నెలలు ఎప్పుడెప్పుడు అయిపోతాయా అంటూ డిసెంబర్ 22న విడుదలకాబోతున్న ‘సలార్’ విడుదల గురించి  అత్యంత ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజునాడు ఈసినిమాకు సంబంధించి ఒక టీజర్ వస్తుందని  అభిమానులు ఆశిస్తున్నప్పటికి డార్లింగ్ పుట్టినరోజునాడు ఈసినిమాకు  సంబంధించి కేవలం ఒక పోస్టర్ తో సరిపెట్టాలని ఈమూవీ దర్శకుడి  ఆలోచన.



ఈలీకులు  విని ప్రభాస్ అభిమానులు తీవ్ర నిరాశను కలిగిస్తున్నట్లు  వార్తలు వస్తున్నాయి. అయితే ఈమధ్య ప్రభాస్ విదేశాలకు వెళ్ళి అక్కడ తన కాలుకు ఆపరేషన్ చేయించుకోవడంతో ఆంధ్రప్రదేశ్ లోని తెలంగాణా లోని తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అనేకమంది ప్రభాస్ అభిమానులు జరుగుతున్న పరిణామాల పట్ల కొంతమేరకు తమ హీరో పై అలిగారు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.



ఈసినిమాను రెండు భాగాలుగా తీయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఇలాంటి రొటీన్ కథను సగటు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారు అంటూ అప్పుడే ప్రభాస్ వ్యతిరేక వర్గం సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పెడుతోంది. అయితే ఈమూవీ మొదటి భాగంలో ఎవరి పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది అన్న విషయం ఈ మూవీ నిర్మాతల నుండి పెద్దగా తెలియక పోవడంతో మరొక ఊహాగానికి శ్రీకారం చుట్టారు.



ఈమూవీ ఫస్ట్ పార్ట్ లో తండ్రి పాత్ర చనిపోతాడని ఆతరువాత కోపంతో రగిలిన ప్రభాస్ ‘సలార్’ పాత్ర ఈమూవీకి అత్యంత కీలకంగా మారబోతోంది అన్న లీకులు కన్నడ మీడియా రాస్తోంది. అయితే ఈమూవీ ట్రైలర్ విడుదల అయిన తరువాత మాత్రమే ఈమూవీ కథ పై ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే పరిస్థితులలో ఈమూవీ విడుదల అయ్యేంత వరకు అనేక గాసిప్పులు ఈమూవీ కథ పై వస్తూనే ఉంటాయి. మరికొందరైతే ఈమూవీ ఫస్ట్ పార్ట్ లో కొడుకు పాత్ర అయిన ‘సలార్’ పాత్ర చాల తక్కువగా కనిపిస్తుందని ఈమూవీ పార్ట్ 2లో మాత్రమే ‘సలార్’ విశ్వరూపం ఉంటుంది అని అంటున్నారు..    



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: