'టైగర్ నాగేశ్వరరావు' మూవీని పాన్ ఇండియా అనొద్దు : రవితేజ
అయితే రవితేజ ఏజ్ పెరుగుతుంది. కానీ రవితేజ లో ఉన్న ఎనర్జీ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఇక ఆయనలో ఉన్న ఎనర్జీ చూసి మిగతా హీరోలు కూడా షాక్ అవుతూ ఉంటారు అని చెప్పాలి. ఇక కేవలం సినిమాల్లో మాత్రమే కాదండోయ్ బయట కూడా అంతే ఎనర్జీని మెయింటైన్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. అయితే మాస్ మహారాజా రవితేజ మరికొన్ని రోజుల్లో టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ఈనెల 20వ తేదీన విడుదల కాబోతుంది అన్న విషయం తెలిసిందే.
ఇక స్టువర్టుపురం దొంగ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఈ మూవీ పై ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయి అని చెప్పాలి. రవితేజ కెరియర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని అభిమానులు కూడా అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే ప్రమోషన్స్ లో భాగంగా అభిమానులతో ముచ్చటించారు రవితేజ. మీరు ఎప్పుడు ఇంత ఎనర్జీ గా ఎలా ఉంటారు అంటూ ప్రశ్నించగా.. ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలని పాజిటివ్గా ఉంటే ఎనర్జీ అదే వస్తుంది అంటే చెప్పుకొచ్చాడు. ఇక టైగర్ నాగేశ్వరరావు సినిమాను పాన్ ఇండియా అని పిలవద్దని.. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అని కాదు ఇక ఇండియన్ మూవీ అని పిలవాలని.. అలా పిలిస్తేనే నాకు ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు.