రివ్యూ: లియో రివ్యూ.. మరో బ్లాక్ బస్టర్ కోట్టిన విజయ్- లోకేష్

Divya
తమిళ హీరో విజయ్ దళపతి తాజాగా నటించిన లియో సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ చిత్రాన్ని ముఖ్యంగా డైరెక్టర్ లోకేష్ కనకరాజు తెరకెక్కిస్తూ ఉండడంతో ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో మంచి పాపులారిటీ అందుకున్నది ఇందులో హీరోయిన్గా త్రిష నటిస్తూ ఉండడంతో పాటు ప్రియ ఆనంద్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది అంతేకాకుండా విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ తో పాటు సంజయ్ దత్ కూడా నటించారు. భారీ అంచనాల మధ్య భారీ బడ్జెట్ తో ఈ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సక్సెస్ అయ్యిందో లేదో తెలుసుకుందాం.

ప్రస్తుతం లియో సినిమాకు హిట్ టాక్ వచ్చినట్లుగా తెలుస్తోంది.. లోకేష్ విజయ్ దళపతి కాంబినేషన్లో గతంలో వచ్చిన మాస్టర్ సినిమా ఊహించని స్థాయిలో అందుకుంది. లియో సినిమాకి ప్రమోషన్స్ తక్కువగా చేసిన ఈ సినిమా భారీ బిజినెస్ జరిగింది విదేశాలలో సైతం లియో సినిమా విడుదలకు ముందే టికెట్ల విషయంలో అడ్వాన్స్ రికార్డులను సైతం సృష్టించింది. తమిళ్ తెలుగు కన్నడ మలయాళం హిందీ భాషలలో ఈ రోజున విడుదల కావడం జరిగింది ఇప్పటికీ యూఎస్ఏ లో ప్రీమియర్ షోలు కూడా ప్రదర్శనయ్యాయి.
అక్కడ తెలిపిన ప్రేక్షకుల మేరకు సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందని ఫస్ట్ ఆఫ్ అదిరిపోయిందని లోకేష్ కనకరాజు టేకింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని తెలుపుతున్నారు. అలాగే అనిరుద్ సంగీతం కూడా ఎప్పటిలాగానే అదిరిపోయిందని తెలియజేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమాకి సంబంధించి కొన్ని క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇంటర్వెల్ బ్యాంకింగ్ లో అర్జున్ పరిచయమవుతారట ఈ సీన్ అదిరిపోయేలా ఉందని పలువురు ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో హైన తో విజయ్ చేసిన మంచులో ఫైట్ కూడా వైరల్ గా మారుతోంది. మరొకవైపు లోకేష్ తెరకెక్కించిన ఖైదీ విక్రమ్ సినిమాలు యూనివర్సిటీ బ్లాక్ బస్టర్ అయ్యాయి.. అయితే ఆ సినిమాలో ఈ సినిమాకు భాగం కాదనే విధంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: