ప్రస్తుతం ఈ
మూవీ బృందం వారు
స్పెయిన్ లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను తెరకెక్కిస్తున్నారు. ఇకపోతే
అయాన్ ముఖర్జీ ఈ సినిమాను అత్యంత హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్
మూవీ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ
మూవీ లో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నట్లు అవి కూడా కళ్ళు చెదిరే రేంజ్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే ఈ
మూవీ షూటింగ్ లో
ఎన్టీఆర్ కూడా జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ లో
హృతిక్ రోషన్ ,
ఎన్టీఆర్ లాంటి భారీ క్రేజ్ ఉన్న నటులు నటిస్తుండడంతో ఈ
మూవీ పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇది ఇలా ఉంటే ఈ సినిమాను 2025 వ సంవత్సరం
జనవరి 24 వ తేదీన విడుదల చేసే ప్లాన్ లో ఈ
మూవీ మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరి కొంత కాలం తర్వాత ఈ
మూవీ మేకర్స్ విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ
మూవీ తో
ఎన్టీఆర్ బాలీవుడ్
ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మరి
ఎన్టీఆర్ కి ఈ
మూవీ ఎలాంటి క్రేజ్ ను
హిందీ సినీ పరిశ్రమలో తీసుకువస్తుందో చూడాలి.