వచ్చే ఏడాది హీరోయిన్ తమన్నా పెళ్లి.. ఎప్పుడంటే..?
అయితే ఇప్పుడు తాజాగా ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.. అదేమిటంటే త్వరలోనే వీరి వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా నిశ్చితార్థం పెళ్లి తేదీలు కూడా కన్ఫామ్ చేసుకుంటున్నట్లు బాలీవుడ్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి ..ఈ పెళ్లి మాత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చేసుకోబోతున్నట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే ఈ ఎడాది చివరిలోపు వీరి ఎంగేజ్మెంట్ జరగబోతోందట. 17 ఏళ్ల వయసులోనే సుమారుగా 50 కి పైగా సినిమాలలో నటించిన తమన్నా ప్రస్తుతం పలు రకాల వెబ్ సిరీస్లలో కూడా నటిస్తున్నది.
గతంలో కాస్త పద్ధతిగా కనిపించిన తమన్నా ఈ మధ్యకాలంలో రెచ్చిపోయి మరి తన అందాలను ఒలకబోస్తూ బెడ్ రూమ్ సీన్లలో కూడా నటిస్తూ అందరికీ షాక్ గురి చేస్తోంది. గతంలో కంటే ఈమధ్య తమన్నా కాస్త బొద్దుగా కనిపిస్తున్న అవకాశాలు మాత్రం భారీగానే సంపాదించుకుంటోంది.జైలర్ సినిమాలో కూడా అలరించిన ఈ ముద్దుగుమ్మ మరింత క్రేజీ అందుకుంది. తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో పెళ్లిపై తమన్నా త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తుందేమో చూడాలి మరి. ఈ విషయం మాత్రం అటు బాలీవుడ్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ మారుతున్నది.