ఫుల్ జోష్లో సిద్దు జొన్నలగడ్డ..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో ఒకరు అయినటువంటి సిద్దు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటుడు తన కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో నటించిన అవి ఏవి కూడా ఈ నటుడు కి పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు. ఇక పోయిన సంవత్సరం ఈయన డిజె టిల్లు అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా ... సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మించారు. పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో అలరించింది.


దానితో ఈ మూవీ మంచి విజయం సాధించడం మాత్రమే కాకుండా ఈ సినిమా ద్వారా సిద్దు కి సూపర్ క్రేజ్ తెలుగు సినిమా పరిశ్రమలో లభించింది. ఇక డిజె టిల్లు మూవీ సూపర్ సక్సెస్ సాధించడంతో ఆ మూవీ కి కొనసాగింపుగా రూపొందుతున్న టిల్లు స్క్వేర్ మూవీ లో ప్రస్తుతం సిద్దు హీరో గా నటిస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ సెట్స్ పై ఉండగానే ఈ నటుడు "తెలుసు కదా" అనే మూవీ లో హీరో గా నటించబోతున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక వీడియోను కూడా విడుదల చేశాడు. ఇకపోతే ఈ మూవీ లో శ్రీ నిధి శెట్టి , రాశి కన్నా హీరోయిన్ లుగా నటించబోతున్నట్లు కూడా ఈ మూవీ బృందం ప్రకటించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ కూడా ప్రారంభం అయింది. ఇలా ఓ మూవీ సెట్స్ పై ఉండగానే మరో మూవీ ని సెట్ చేసుకొని సిద్దు ప్రస్తుతం ఫుల్ జోష్ లో తన కెరీర్ ను ముందుకు సాగిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: