మాస్ మహారాజా రవితేజ తాజాగా టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి వంశీ దర్శకత్వం వహించగా ... నుపూర్ సనన్ , గాయత్రి భరద్వాజ్ లు ఈ మూవీ లో రవితేజ కు జోడిగా నటించారు. ఇకపోతే ఈ మూవీ లో మురళి శర్మ , అనుపమ్ కేర్ , నాజర్ కీలక పాత్రలలో నటించగా ... జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ తాజాగా అక్టోబర్ 20 వ తేదీన దసరా పండుగ సందర్భంగా థియేటర్ లలో విడుదల అయింది.
ఈ మూవీ టైగర్ నాగేశ్వరరావు అనే బందిపోటు దొంగ జీవిత కథ ఆధారంగా రూపొందింది. దానితో రవితేజ ఈ మూవీ లో బందిపోటు దొంగ పాత్రలో కనిపించి తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ఇకపోతే ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ లభించింది. అయినప్పటికీ ఈ మూవీ కి మొదటి రోజు సూపర్ సాలిడ్ కలెక్షన్ లు ప్రపంచ వ్యాప్తంగా దక్కాయి. ఈ మూవీ తెలుగు తో పాటు నిన్న అనగా అక్టోబర్ 20 వ తేదీన తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో కూడా విడుదల అయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ప్రస్తుతం విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతున్న సమయం లోనే ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క సాటిలైట్ హక్కులను స్టార్ మా సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు అందులో భాగంగా ఈ మూవీ థియేటర్ రన్ కొన్ని వారాలు ముగిసిన తర్వాత "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఆ తర్వాత కొన్ని వారాలు ముగిసిన తర్వాత ఈ మూవీ స్టార్ మా చానల్లో ప్రసారం కానున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ వార్తకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.