క్రిష్ -4 పై శ్రద్ధ కపూర్ లీక్..!!
క్రిష్ ఫ్రాంచేసి అభిమానులకు ఒక శుభవార్త తెలియజేసింది హీరోయిన్ శ్రద్ధ కపూర్.. కొన్ని క్రిప్టిక్ సెల్ఫీలను షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటోలు రిలీజ్ చేయగానే జాదూ లాంటి ధూప్ కావాలి అని రాసింది.. శ్రద్ధ దాస్ పోస్ట్ పైన హృతిక్ రోషన్ వెంటనే స్పందిస్తూ అతడు వస్తున్నాడు.. అతనితో చెబుతాను అంటూ వ్యాఖ్యానించడం జరిగింది. దీనికి శ్రద్ధ కపూర్ ఎంతో ఉద్వేగంతో స్పందిస్తూ అసలు??? అన్నట్టుగా అని అడిగారు అభిమానులంతా ఇద్దరి నడుమ కామెంట్స్ చూసి ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయారు.. ఒక అభిమాని ఇలా అడుగుతూ శ్రద్ధ కపూర్ క్యా బాత్ హై మామ్ క్రిష్ -4 లో నటిస్తున్నారా అని అడగడం జరిగింది.
చాలా మంది కూడా హృతిక్ రోషన్ ,శ్రద్ధ కపూర్ జంటగా కలిసి నటించాలని కోరుకుంటున్నారు. క్రిష్ -4 లో శ్రద్ధా కపూర్ బాగం అసలు ఊహించలేనిదని ఇప్పటివరకు ఈ ఫ్రాంచేసి తో ఎలాంటి సంబంధం లేదు.. ప్రియాంక చోప్రా కంగానా లాంటి కథానాయకులు ఇలాంటి ఫ్రాంచేసి లో నటించారు.. ప్రస్తుతానికి హృతిక్ ఫైటర్ సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో విడుదల కాబోతోంది. మరి ఏ మేరకు క్రిష్ -4 పై అప్డేట్ తెలియజేస్తారో చూడాలి మరి.