లియో: భారీ ఓపెనింగ్స్.. కానీ భారీ లాస్ తప్పదు?

Purushottham Vinay
తమిళ స్టార్ స్టార్ హీరో తలపతి విజయ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో 'మాస్టర్' సినిమా తర్వాత వచ్చిన మరో క్రేజీ పాన్ ఇండియా మూవీ 'లియో'. అక్టోబర్ 19 న దసరా కానుకగా ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా భారీగా రిలీజ్ అయ్యింది.అయితే మొదటి షోతోనే ఈ మూవీ మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది.దానికి కారణం ఆడియన్స్ అంచనాలని అందుకోకపోవడం.విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ హైప్ ఏర్పడింది. అందువల్ల అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీ స్థాయిలో నమోదయ్యాయి.ముందుగా చెప్పినట్టే ఈ సినిమా తెలుగులో మొదటి రోజు రూ.8 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసింది. అయితే నిన్న ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా రిలీజ్ అయ్యింది. మరోపక్క పాజిటివ్ టాక్ వల్ల ‘భగవంత్ కేసరి’ సినిమా కూడా బాగా హోల్డ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ‘లియో’ రెండో రోజు ఎంత కలెక్ట్ చేస్తుంది అనే ఆసక్తి అందరిలో కూడా పెరిగింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం తెలుగులో రెండో రోజు కూడా లియో సినిమా స్ట్రాంగ్ గా ఉందని తెలుస్తుంది.తెలుగులో లియో రెండో రోజు రూ.3.5 కోట్ల దాకా షేర్ ని కలెక్ట్ చేసిందని సమాచారం తెలుస్తుంది. దీంతో రెండు రోజుల్లో ‘లియో’ రూ.12 కోట్ల వరకు షేర్ వచ్చిందని సమాచారం.ఇప్పటికే 50% రికవరీ అయ్యిందని సమాచారం.



సోమవారం నాటికి ఈ మూవీ తెలుగులో ఇట్టే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ కూడా లేకపోలేదు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో అయితే (LEO) బ్రేక్ ఈవెన్ అయ్యేట్టు సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే కేరళలో 12 కోట్ల ఓపెనింగ్స్ నమోదు చేసి kgf 2(7.8 కోట్లు) ని దాటేసి టాప్ లో వుంది. వరల్డ్ వైడ్ గ్రాస్ విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 కోట్ల దాకా వసూలు చేసిందని సమాచారం కానీ ఈ వసూళ్లు సరిపోవు. ఎందుకంటే తమిళ నాడులో లియోకి భారీగా డ్రాప్స్ పడుతున్నాయి. తమిళనాడులో డే 1 రికార్డ్ అజిత్ కుమార్ వలిమై సినిమా పేరిట మాత్రమే ఉంది.వలిమై 36.17 కోట్లు,రజినీకాంత్ అన్నాత్తే 34.92 కోట్లు ఇంకా 2.0 33.58 కోట్లు టాప్ 3 లో ఉన్నాయి. సొంత రాష్ట్రంలో విజయ్ లియో టాప్ 3 లో కూడా లేదు.మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో, కేరళలో సేవ్ అయిన లియో సొంత రాష్ట్రం తమిళనాడులో సేవ్ అవ్వలేదు. ఇక విజయ్ ప్రస్తుతం తన 68 వ సినిమా షూటింగ్ లో వున్నాడు. ఈ సినిమా షూటింగ్ లో రంగం ఫేమ్ అజ్మల్ జాయిన్ అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: