ఆ కారణం వల్ల ఏ పని చేయలేకపోతున్నాను :: వితికా షెరు

murali krishna
పడ్డానండీ ప్రేమలో మరి(2015).. ఈ సినిమా లో వరుణ్‌ సందేశ్‌, వితికా షెరు జంటగా నటించారు. ఆన్‌ స్క్రీన్‌ పై జోడీ కట్టిన ఈ జంట నిజ జీవితం లోనూ జంటగా మారారు.సినిమా విడుదలై న మరుసటి ఏడాదే పెళ్లిపీటలెక్కారు. ఈ బ్యూటి ఫుల్‌ కపుల్‌ తెలుగు బిగ్‌బాస్‌ మూడో సీజన్‌ లోనూ పాల్గొన్నారు. కానీ ఆ సమయం లో వితికా పై విపరీతమైన నెగెటివిటీ వచ్చింది. ఆ వ్యతిరేకతను చూసిన వితిక చాలా కాలం పాటు డిప్రెషన్‌ లో ఉండిపోయింది. తర్వాత దాని నుంచి బయటకు వచ్చి యూట్యూబర్‌గా మారింది.అయితే వితిక కొంతకాలంగా ఓ వ్యాధి తో బాధపడుతోందట.


ఈ విషయాన్ని ఆమె స్వయం గా తన యూట్యూబ్‌ ఛానల్‌లో వెల్లడించింది. నాకు స్పాండి లైటిస్‌, మైగ్రేన్‌ వ్యాధులు ఉన్నాయి. విపరీతమైన తలపోటు, మెడనొప్పి వల్ల ఏ పనీ చేయలేక పోతున్నాను. స్పాండిలైటిస్‌కు గానూ ఫిజియోథెరపీ చేయించు కుంటున్నాను. ఇటీవలే నీడ్లింగ్‌ నొప్పి తీవ్రంగా ఉన్న చోట సూదులతో గుచ్చే ప్రక్రియ చేయిం చుకున్నాను. కానీ తర్వాత కనీసం నా పనులు నేను చేసుకోగలిగాను. ఒత్తిడి వల్ల నెల రోజుల నుంచి మెడనొప్పి మరింత తీవ్రం గా మారింది. ఆ పెయిన్‌ భరించలేకపోతున్నాను.రెండువారాల క్రితం మైగ్రేన్‌ మొదలైంది. 


ఈ రెండింటి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాను. గతంలోనూ స్పాండియాలసిస్‌ తో బాధపడ్డాను, కానీ దాని నుంచి కోలుకున్నాను. హమ్మయ్య, ఇక ఆరోగ్యంగా ఉన్నాను అనుకునే లోపు మళ్లీ అంతా మొదటికి వచ్చింది. అందుకే కొంత బాధ గా ఉంది. అయితే ఈ వ్యాధిని పూర్తి గా నయం చేయలేం. కానీ త్వరలో నే సాధ్యమైనంతవరకు కోలుకుని యూట్యూబ్‌ లో అద్భుత మైన వీడియోలు చేస్తాను' అని చెప్పుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు వితిగా త్వర గా కోలుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: