కోలీవుడ్ హీరో విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా లియో. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా హైఎక్స్ పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ గా నిలిచింది.లోకేష్ కనగరాజ్ సినిమా అంటే ఇంకేదో ఉంటుందని వెళ్ళిన ప్రేక్షకులని పూర్తిగా ఈ లియో మూవీ నిరాశపరిచింది.సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ తప్ప బలమైన కథ, కథనం లేకపోవడంతో అట్టర్ ప్లాప్ టాక్ వచ్చింది. అన్ని భాషలలో ఫ్లాప్ అయినట్లే కనిపిస్తోంది.తమిళనాడులో కూడా ఈ సినిమా ఇప్పటిదాకా కేవలం 50 కోట్లు మాత్రమే వసూలు చేసింది.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో పార్తివన్ లియో అని చూపించే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మరీ తీసికట్టుగా ఉంది. లియో సినిమా గురించి మొదట్లో ఇచ్చిన బిల్డప్ చూసిన ఆడియన్స్ ఇంటరెస్టింగ్ ఫ్లాష్ బ్యాక్ ఎక్స్ పెక్ట్ చేశారు. అయితే దానికి విరుద్ధంగా ఏ మాత్రం ప్రభావం చూపించని చెత్త ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని కనగరాజ్ డిజైన్ చేశారు. పైగా దాంట్లో నరబలి కాన్సెప్ట్ పెట్టడం ఎవ్వరికి రుచించలేదు.
ఇంకా అలాగే లియో దాస్ గా విజయ్ ని అంత పవర్ ఫుల్ గా చూపించలేకపోయాడు. ఏదో అలా నడిచిపోతుంది తప్ప క్రూరుడుగా ఎస్టాబ్లిష్ చేసే బలమైన సీక్వెన్స్ లోకేష్ సరిగ్గా డిజైన్ చేయలేదు.ఇక ఇదిలా ఉంటే ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అబద్దమై ఉండొచ్చు కదా అనే మాటని లియో సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. జైల్లో ఉరిశిక్ష పడ్డ ఖైదిగా ఉన్న లియో స్నేహితుడు పోలీస్ ఆఫీసర్ గౌతమ్ మీనన్ కి అబద్ధం చెప్పి ఉండొచ్చు కదా అనే పాయింట్ ని రైజ్ చేశారు. పోలీస్ ఆఫీసర్ విజయ్ ఫోటో చూపించిన తర్వాత లియో దాస్ ఇతను ఒకరు కాదని చెప్పేసి ఆ ఖైదీ వెళ్ళిపోతాడు. దీంతో అక్కడే ఏదో విషయాన్ని దాస్తున్నాడు అనే డౌట్ ని క్రియేట్ చేస్తూ లోకేష్ కనగరాజ్ వదిలేసాడు.అయితే దానికి ముగింపు ఇచ్చే ప్రయత్నం చేయలేదు. అలా కొన్ని పాత్రలకి ఎండింగ్ ఇవ్వకుండా లియో కథలో ఇంకేదో ఉందనే డౌట్ ని కూడా రేకెత్తించాడు. అలా దాచి సీక్వెల్ కోసం ఉంచామని చెప్పి లియో టీం నాటకాలు ఆడుతూ ఆడియన్స్ ని చీట్ చేస్తుంది.అందుకు తగ్గట్లే ఆడియన్స్ లియోని డిజాస్టర్ చేశారు.