కొత్త ఇల్లు కొన్న కృతి సనన్.. ధర ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
హీరోయిన్గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న కృతి సనన్ నిరంతరం ఏవో ఒక వార్తలో నిలుస్తూనే ఉంటుంది. ఇటీవల ఆమె మిమిలో తన నటనకి గాను ఉత్తమ నటిక జాతీయ చలనచిత్ర అవార్డుని సైతం సొంతం చేసుకుంది. దాంతోపాటు ఆమె నటించిన గణపత్ సినిమా సైతం గత శుక్రవారం విడుదల అయింది. కానీ ఆ సినిమా తనకి అంతగా కలిసి రాలేదు అని చెప్పాలి. హిట్ సినిమాలు లేకపోయినప్పటికీ కృతి సనన్ ఒక మంచి అపార్ట్మెంట్ కోసం గత కొంతకాలంగా వెతుకుతుంది అన్న వార్తలు కొద్ది రోజుల నుండి సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. అయితే తాజాగా ఇప్పుడు అవే వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

 అది ఏంటంటే కృతి తన కోసం బాంద్రాలో కొత్త ఇంటిని కొలువలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇంకా ఈ విషయాన్ని ఈ ముద్దుగుమ్మ ఇంకా బయట పెట్టలేదు. ఇటీవల ఈ నటి బాంద్రా లోని తన కొత్త అపార్ట్మెంట్ వెలుపల కనిపించింది. మీడియా నివేదికల ప్రకారం కృతి భవనం లో ఫోర్ bhk అపార్ట్మెంట్ను కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక దాని విలువ దాదాపుగా 35 కోట్లకు పైగానే ఉంటున్నట్లుగా తెలుస్తోంది. దాంతోపాటు క్రికెటర్ కేఎల్ రాహుల్ సైతం అదే అపార్ట్మెంట్లో ఉంటున్నట్లుగా సమాచారం.

దీంతో ఈ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. కృతి సనన్ సినిమాల విషయానికి వస్తే ఆమె నటించిన గణపత్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాంతో పాటు ఆమె టైగర్ శ్రాఫ్ అమితాబచ్చన్ సైతం ఈ సినిమాలో ఒక కీలకపాత్రలో కనిపించరు. కాగా ఈ సినిమాలో ఆమె పవర్ఫుల్ యాక్షన్ పాత్ర లో కనిపించింది. కాగా ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని ఆకట్టుకోవడంలో విఫలమైంది. అలా కృతి సనన్ కొత్త ఇంటికి సంబంధించిన ఈ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: