గేమ్ ఛేంజర్ ఫస్ట్ సాంగ్ రిలీజ్.. ఎన్ని కోట్లు ఖర్చు అంటే..?

Divya
టాలీవుడ్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్.. ఈ సినిమా దసరా సందర్భంగా ఒక పోస్టర్ని సైతం చిత్ర బృందం విడుదల చేయడం జరిగింది. కలర్ ఫుల్ గా ఉండే ఈ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అంటూ రామ్ చరణ్ అభిమానులు సైతం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే దసరా కానుకగా గేమ్ చేంజర్ పోస్టర్ విడుదల చేస్తూ దీపావళి కానుకగా ఈ సినిమా నుండి జరగండి అనే పాటను విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేయడం జరిగింది.


ఈ సినిమా మొదటి పాటను దీపావళికి విడుదల చేయాలని చూస్తున్న చిత్ర బృందం ఏకాంగ ఈ పాట కోసం 16 కోట్ల రూపాయల బడ్జెట్ తో చాలా విలాసవంతంగా చిత్రీకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. యాక్షన్ కథ అంశంతో తెరకెక్కించిన ఈ సినిమా లో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారు నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లే డైరెక్టర్ శంకర్ ఈ సినిమా మేకింగ్ ఎలా ఉంటుందో ఇక చెప్పాల్సిన పనిలేదు.. రామ్ చరణ్ కూడా ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించారు.


ఈ సినిమా పైన భారీగా అంచనాలు ఉండడంతో ఈ సినిమా విడుదల తేదీ కోసం పెద్ద ఎత్తున అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందిస్తూ ఉన్నారు. హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తున్నది. అలాగే అంజలి సముద్రఖని ,ఎస్ జె సూర్య, సునీల్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ తదితరులు సైతం ఇందులో కీలకమైన పాత్ర లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: