అదిరిపోయే టైటిల్ తో శర్వానంద్ నెక్స్ట్ మూవీ..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో శర్వానంద్ ఒకరు. ఇకపోతే ఈయన ఆఖరుగా ఒకే ఒక జీవితం అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఈ మూవీ లో రీతు వర్మ ... శర్వా కి జోడిగా నటించగా ... వెన్నెల కిషోర్ , ప్రియదర్శి ఈ మూవీ లో శర్వానంద్ కి స్నేహితుల పాత్రలలో నటించారు. ఇకపోతే ఈ మూవీ చాలా రోజుల తర్వాత శర్వా కి మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందించింది.


ఇకపోతే ప్రస్తుతం ఈ నటుడు కృతి శెట్టి హీరోయిన్ గా రూపొందుతున్న ఓ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ జోష్ లో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ సినిమాకి చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు ఓ టైటిల్ ఆల్మోస్ట్ కన్ఫామ్ చేసినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం ఈ సినిమాకి "మనమే" అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు ఇదే టైటిల్ ను ఆల్మోస్ట్ ఈ చిత్ర బృందం అంతా ఓకే చేసినట్లు మరికొన్ని రోజుల్లోనే ఈ టైటిల్ ను అధికారికంగా ఈ మూవీ బృందం విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


మరి వరుస అపజయాల తర్వాత ఒకే ఒక జీవితం మూవీ తో మంచి విజయాన్ని అందుకొని ట్రాక్ లోకి వచ్చిన శర్వా ఈ మూవీ తో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉంటే శర్వా కి రజనీ కాంత్ హీరోగా టి జే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో ఓ కీలక పాత్రలో అవకాశం దక్కినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: