పెళ్లి చూపులు
మూవీ తో హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న
విజయ్ దేవరకొండ ఆ తర్వాత
అర్జున్ రెడ్డి ,
టాక్సీవాలా , గీత గోవిందం లాంటి విజయాలతో
టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈ నటుడు కొంత కాలం క్రితమే
ఖుషి అనే
మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు.
లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్
మూవీ గా రూపొందిన ఈ
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ నటుడు
పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో
హీరో గా నటిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ
మూవీ లో మృణాల్ ఠాకూర్
హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ
మూవీ ని వచ్చే సంవత్సరం
సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ
మూవీ తర్వాత
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో
విజయ్ హీరోగా నటించబోతున్నాడు. ఈ సినిమాను
సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మించబోతున్నారు. ఇకపోతే కొన్ని రోజుల క్రితం నుండి తనకు
టాక్సీవాలా మూవీ తో సూపర్
సక్సెస్ ను
బాక్స్ ఆఫీస్ దగ్గర అందించిన దర్శకుడు
రాహుల్ సంకుర్తియన్ దర్శకత్వంలో
విజయ్ మరో
మూవీ చేయబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతున్న విషయం మనకు తెలిసిందే.
ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం
రాహుల్ కొన్ని రోజుల క్రితమే
విజయ్ కి ఓ కథను వినిపించినట్లు ఆ కథ చాలా భాగం
విజయ్ కి నచ్చినప్పటికీ కొంత భాగం మాత్రం మార్పులను ... చేర్పులను సూచించినట్లు ప్రస్తుతం దర్శకుడు ఈ సినిమాలోని కొంత భాగాన్ని మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అన్ని కుదిరితేనే ఈ
మూవీ ఓకే అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే అంతా సెట్ అయితే ఈ
మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.