నా లిప్ కిస్ అతనికే అంటున్న విజ్జిపాప....!!
నేను ఏ హీరోకి లిప్ కిస్ ఇవ్వను. లిప్ లాక్ సన్నివేశాల్లో నటించను. అలాంటి సన్నివేశం చేయాల్సి వస్తే నా లిప్ కిస్ నా భర్తకే ఇస్తాను, అంది. శ్రీలీల తన మొదటి ముద్దు కట్టుకున్న వాడికే ఇస్తానని చెప్పి తప్పుకుంది. హీరోయిన్స్ డిమాండ్స్ వాళ్లకు ఫేమ్ ఉన్నంత వరకే… ఒకసారి పక్కన పడితే ఎలాంటి సన్నివేశాల్లోనైనా నటించడానికి రెడీ అంటారు. ఇది చాలా మంది హీరోయిన్స్ విషయంలో రుజువైంది. ప్రస్తుతం శ్రీలీల మహేష్ కి జంటగా గుంటూరు కారం చేస్తుంది. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకుడు. హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ కాంబోలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో కూడా శ్రీలీల హీరోయిన్. నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మాన్, వైష్ణవ్ తేజ్ ఆదికేశవ చిత్రాల్లో శ్రీలీల నటిస్తుంది. ఆమె లేటెస్ట్ రిలీజ్ భగవంత్ కేసరి సక్సెస్ వైపు దూసుకెళుతుంది.