పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ ప్రస్తుతం
టాలీవుడ్ టాలెంటెడ్
డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న "ఓజి" అనే
మూవీ లో
హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ ని డి
వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ
నిర్మాత డి
వి వి విధానయ్య నిర్మిస్తూ ఉండగా ... ఈ సినిమాలో మోస్ట్
బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని
ప్రియాంక అరుల్
మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ
మూవీ మొత్తం రెండు భాగాలుగా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో పవన్ గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించబోతున్నాడు.
ఇప్పటికే ఈ
సినిమా నుండి ఈ
మూవీ మేకర్స్ ఓ గ్లిమ్స్ వీడియోని విడుదల చేయగా అది అదిరిపోయి రేంజ్ లో ఉండడం అలాగే అందులో పవన్ లుక్స్ ... డైలాగ్ డెలివరీ అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాపై ఒక్క సారిగా ప్రేక్షకుల్లో అంచనాలు తారా స్థాయిలో పెరిగి పోయాయి. ఇకపోతే తాజాగా ఈ
మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అసలు విషయం లోకి వెళితే ... భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమాలో
బిగ్ బాస్ బ్యూటీ శుభ
శ్రీ కి అవకాశం వచ్చినట్లు ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ముద్దు గుమ్మ "ఓజి" సినిమాలో ఓ కీలక పాత్రలో ఎంపిక అయినట్లు ... ఈ
మూవీ లో ఈ నటి పాత్ర నిడివి చాలా చిన్నది అయినప్పటికీ ఈ సినిమాలో మంచి గుర్తింపు గల పాత్రలో శుభ
శ్రీ కనిపించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ వార్త కనుక నిజం అయితే శుభ
శ్రీ కి అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలో అవకాశం దక్కినట్లు అవుతుంది. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో కంటెస్టెంట్ గా పాల్గొంది. ఈ సీజన్ తో ఈ నటికీ మంచి గుర్తింపు లభించింది.