రాజమౌళి కోసం అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన రవితేజ.. ఏంటంటే..!?

Anilkumar
మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. హిట్ల్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ఇండస్ట్రీకి వచ్చి భారీ గుర్తింపును సొంతం చేసుకున్నాడు. వచ్చి నప్పుడు ఎలా ఉండేవాడు ఇప్పటికి అదే విధంగా కొనసాగుతూ మాస్ మహారాజా గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే రవితేజ కెరియర్ లోనే గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ఏది అంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చే పేరు విక్రమార్కుడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో మనందరికీ తెలిసిందే. అప్పటినుండి వీళ్ళందరి కాంబినేషన్ రెండోసారి


రిపీట్ అవ్వాలి అని ఇప్పటికీ కోరుకుంటున్నారు. మాస్ రాజా అభిమానులు అయితే తాజాగా ఆ ముచ్చట తీరిపోతుంది అని అంటున్నారు చాలామంది. ఇటీవల వీళ్లిద్దరికి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగవారు అవుతుంది. రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమాలో రవితేజ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు తెగ శికార్లు చేస్తున్నాయి. మహేష్ బాబు హీరోగా నటించబోయే సినిమాలో రవితేజ భయంకరమైన క్రూయాల్టీ ఉన్న ఒక విలన్ పాత్రలో కనిపించబోతున్నారు అని అంటున్నారు.


మాస్ రాజా గా గుర్తింపు సంపాదించుకున్న రవితేజ ఇటువంటి స్టార్ హీరో సినిమాలో విలన్ పాత్రలో చేయడంతో మాస్ రాజా అభిమానులు కాస్త డిసప్పాయింట్ అయినప్పటికీ వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ అయితే బాగుంటుంది అని కోరుకుంటున్న వారికి మాత్రం ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. గతంలో విక్రమార్కుడు సినిమా ఇచ్చిన హిట్టు కోసం రవితేజ ఈ విధంగా దర్శక ధీరుడు రాజమౌళి ఋణం తీర్చుకుంటున్నారు అంటూ ఈ వార్త విన్న వారందరూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఇలా రాజమౌళి రవితేజ కాంబినేషన్ సెట్ అవ్వడంతో మాస్ రాజా అభిమానులు ఖుషి అవుతున్నారు. అలా ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: