సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వరుణ్ తేజ్, లావణ్య ల శుభలేఖ..!!

Anilkumar
త్వరలోనే మెగా ఇంట పెళ్లి సందడి స్టార్ట్ అవ్వబోతోంది. టాలీవుడ్ నటుడు నాగబాబు కొడుకు హీరో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలా పెళ్లి జరగబోతోంది. కుటుంబ సభ్యులు సమక్షంలో విరి ఎంగేజ్మెంట్ సైతం ఇటీవల జరిగింది. ఇప్పుడు పెళ్లి పనులను కూడా స్టార్ట్ చేశారు. గత కొద్ది రోజుల క్రితం ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చిరంజీవి ఇంట్లో జరిపారు వాటికి సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాని తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన నివాసంలో నూతన జంటకు స్పెషల్ పార్టీ సైతం ఇచ్చారు. తాజాగా ఇప్పుడు మెగా నివాసంలో


పెళ్లి పనులను స్టార్ట్ చేశారు. అయితే తాజాగా నిన్నటి నుండి సోషల్ మీడియాలో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిన శుభలేఖ తెగ వైరల్ అవుతుంది. ఆ పెళ్లి కార్డులో వరుణ్ తేజ్ నానమ్మ తాతయ్య పేర్లతో పాటు పెదనాన్న చిరంజీవి బాబాయి పవన్ కళ్యాణ్ అన్నయ్య రామ్ చరణ్ పేర్లు సైతం ఉండడంతో మెగా ఫ్యాన్స్ అందరూ ఖుషీ అవుతున్నారు. అక్టోబర్ 30 నుండి వీరు పెళ్లి వేడుకలు స్టార్ట్ అవ్వబోతున్నాయి. నవంబర్ 1న ఇటలీలోని టుస్కానీ నగరంలో వరుణ్ లావణ్య కుటుంబ సభ్యుల మధ్య వీరిద్దరి పెళ్లి జరగబోతోంది. ఇప్పటికే రామ్ చరణ్ ఉపాసన ఇద్దరు కూడా


 ఇటలీకి వెళ్లి పెళ్లి పనులను సైతం స్టార్ట్ చేశారు. కాగా ఈ శుక్రవారం మెగా అల్లు ఫ్యామిలి. ఇటలీ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. అక్టోబర్ 30న కాక్ టెయిల్ పార్టీతో స్టార్ట్ చేసి అక్టోబర్ 31న హల్దీ మెహందీ వేడుకలు సైతం జరగనున్నాయి. దాంతోపాటు ఇండస్ట్రీలోని ప్రముఖుల సన్నిహితుల కోసం నవంబర్ ఐదు న హైదరాబాదులోని మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ వేదిక గా రిసెప్షన్ సైతం నిర్వహించబోతున్నారు. ఇక ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండడం వల్ల వరుణ్ తేజ్ వివాహానికి హాజరవుతారా లేదా అన్నది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: