"టైగర్ నాగేశ్వరరావు" కి 6 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
రవితేజ హీరోగా నుపూర్ సనన్ , గాయత్రి భరద్వాజ్ లు హీరోయిన్ లుగా వంశీ దర్శకత్వంలో రూపొందిన టైగర్ నాగేశ్వరరావు సినిమా అక్టోబర్ 20 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో బారి ఎత్తున విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా ఇప్పటి వరకు 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 6 రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు వారిగా వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

ఈ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.33 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి 2 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.45 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.73 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.27 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.23 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

ఈ మూవీ కి 6 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.69 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మొత్తంగా ఈ సినిమాకి 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 16.70 కోట్ల షేర్ ... 28.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ సాలిడ్ కలెక్షన్ లు దక్కుతున్నాయి.

ఇకపోతే ఈ మూవీ కి జీ వి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా ... నాజర్ ,  రేణు దేశాయ్ , అనుపమ్ కేర్ ,  ఈ మూవీ లో ముఖ్య పాత్రలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: