తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి నితిన్ ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకరు అయినటువంటి రాజశేఖర్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈయన ఈ మూవీ లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాలో ఈయన పాత్ర అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో శ్రీ లీల ... నితిన్ కి జోడిగా నటిస్తూ ఉండగా ... హారిజ్ జయరాజ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు . డిసెంబర్ 8 వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు . ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈనెల 30 వ తేదీన ఈ సినిమా టీజర్ ను విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది . మరి ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.
ఇకపోతే ఎక్స్ట్రా ఆర్డినరీ సినిమాకు మొదటగా ఈ టైటిల్ ను కాకుండా "జూనియర్" అనే టైటిల్ అనుకున్నారు. అలాగే ఆల్మోస్ట్ ఈ టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ చివరి నిమిషంలో ఈ సినిమా బృందం ఆ టైటిల్ కాకుండా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇకపోతే "జూనియర్" అనే టైటిల్ ను ఈ సినిమాకు మొదట అనుకోవడానికి ప్రధాన కారణం. ఈ సినిమాలో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఆ కారణం తోనే ఈ సినిమాకు మొదట జూనియర్ అనే టైటిల్ ను అనుకున్నట్లు తెలుస్తుంది.