యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాడు. ఈ క్రమంలో ఈయనకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదిక వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ కుర్ర హీరో తలపతి విజయ్ హీరోగా నటించిన లియో లో ఒక పాత్రలో కనిపించాడు అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు నటిజెన్లు. ఇటీవల దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా కలెక్షన్లతో దూసుకుపోతోంది. లోకేష్ కనగరాజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో విజయ్ సరసన అందాల భామా త్రిషా హీరోయిన్గా నటించిన ఆమెతోపాటు అర్జున్ సర్జ సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించారు.
అనిరుధ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో కుర్ర హీరో కిరణ్ అబ్బావరం సైతం నటించాడు అని ఆయన వికీపీడియా పేజ్ లో చూస్తే తెలుస్తుంది. నిజానికి ఈ సినిమా చూసిన వాళ్లకి లియో సినిమాలో కిరణ్ అబ్బవరం ఎక్కడా కూడా కనిపించలేదు. కానీ వికీపీడియాలో మాత్రం కిరణ్ అబ్బవరం ఫిల్మోగ్రఫీ లో లియో సినిమాలో అతిధి పాత్రలో కనిపించాడు అని.. మీటర్ సినిమాలో ఆయన అర్జున్ కళ్యాణ్ అనే పాత్రలో కనిపించగా అదే పాత్రలో కనిపించాడు అని ఈ సందర్భంగా తెలుస్తోంది. సినిమా చూసినవారు అయితే అసలు లియో సినిమాలో కిరణ్ అబ్బవరం ఎక్కడా కూడా లేడు అని అంటున్నారు.
వికీపీడియాలో ఇలా ఎందుకు వస్తుంది అన్న కామెంట్లను సైతం పెడుతున్నారు. కిరణ్ అబ్బవరం యాంటీ ఫ్యాన్స్ ఇటువంటి పని చేశారు అంటూ కొందరు పేర్కొంటున్నారు. అంతేకాదు సినిమా విడుదల కాకముందు ఈ సినిమాలో రాంచరణ్ కామియో అని ప్రచారం చేశారు. ఇప్పుడు సినిమా విడుదలైన తర్వాత కిరణ్ అబ్బవరం అని ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు ఆ మద్యలో సినిమా విడుదల సమయంలో సైతం ఆయన సినిమా వస్తుంది అని సలార్ సినిమా వాయిదా వేశారు అంటూ చాలామంది ట్రోల్స్ కూడా చేశారు. మొత్తం మీద కిరణ్ అబ్బవరం మాత్రం ఏవో ఒక వార్తల్లో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోనే ఉంటాడు. అలా ప్రస్తుతం తనకి సంబంధించిన ఈ వార్తలు సోషల్ మీడియా మీదిగా వైరల్ అవుతున్నాయి..!!