DJ టిల్లు 2 రిలీజ్ డేట్ లాక్.. ఈసారైనా మోక్షం వచ్చేనా..?
ఈసారి రెట్టింపు వినోదం గ్యారెంటీ అంటూ సెప్టెంబర్ 15వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే సిద్దు , అనుపమల రొమాంటిక్ పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు. కానీ కొన్ని కారణాలవల్ల సినిమా వాయిదా పడింది. ముఖ్యంగా ఈ సినిమా హీరోయిన్ ల విషయంలోనే ఎన్నోసార్లు సినిమా విడుదల తేదీ వాయిదా పడుతూ వచ్చింది. కానీ ఎట్టకేలకు ఇప్పుడు మరొక రిలీజ్ డేట్ ను ప్రకటించింది చిత్ర బృందం.
వచ్చే ఏడాది మహాశివరాత్రి సందర్భంగా 2024 ఫిబ్రవరి 9వ తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని చిత్ర బృందం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ తేదీన సినిమాను రిలీజ్ చేస్తారా? కనీసం అప్పటికైనా మోక్షం వస్తుందా? అన్న అనుమానాలు మళ్లీ మొదలయ్యాయి. మరి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఆ రోజైనా వస్తుందా? లేదా? అన్నది చూడాలి. ఇకపోతే ఈ సినిమాకి సంగీతాన్ని శ్రీ చరణ్ పాకాల, రామ్ మిర్యాల అందిస్తూ ఉండగా.. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మరి ఏ మేరకు ఈ సినిమా విడుదలవుతుంది.. ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.