ఎన్నికలను ప్రభావితం చేయబోతున్న ఆసినిమా !

Seetha Sailaja
మరో నెలరోజుల వ్యవధిలో తెలంగాణాతో పాటు అనేక ఉత్తరాది రాష్ట్రాలలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈఎన్నికలు అటు భారతీయ జనతా పార్టీకి ఇటు కాంగ్రెస్ కి కొన్ని ప్రాంతీయ పార్టీలకు అత్యంత కీలకంగా మారడంతో జాతీయస్థాయిలో పేరున్న నాయకులు అంతా క్షణం తీరికలేకుండా పరుగులు తీస్తున్నారు. ఈఎన్నికలు పూర్తి అయిన మరికొన్ని నెలలలోనే దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న నేపధ్యంలో ఆఎన్నికలు కూడ అన్ని రాజకీయ పక్షాలకు అత్యంత కీలకంగా మారాయి.  

ఇలాంటి పరిస్థితుల మధ్య భారతీయ జనతా పార్టీ భావజాలంతో త్వరలో విడుదలకాబోతున్న ఒక హిందీ సినిమా ఎంతవరకు రాబోతున్న ఎన్నికలను ప్రభావితం చేస్తుంది అన్నఅంశం పై ఆశక్తికర చర్చలు జరుగుతున్నాయి. 100 సంవత్సరాలు ప్రస్థానాన్ని పూర్తి చేసుకోబోతున్న రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్) పై ఒక ప్రతిష్ఠాత్మక మూవీ రాబోతోంది.

బీజేపీ మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ మీద ‘వన్ నేషన్’ పేరుతో ఒక భారీ బడ్జెట్ సినిమా తీయబోతున్నారు. ఈసినిమాను ఆరుగురు జాతీయ అవార్డు విజేతలైన దర్శకత్వం వహిస్తూ ఉండటంతో ఈమూవీ టాపిక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. మళయాళ లెజెండరీ డైరెక్టర్ ప్రియదర్శన్‌తో పాటు ‘కశ్మీర్ ఫైల్స్’ ఫేమ్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి డాక్టర్ చంద్రప్రకాష్ ద్వివేది జాన్ మాథ్యూ మథన్ మంజు బోరా సంజయ్ పురాణ్ సింగ్ చౌహాన్ లు సంయుక్తంగా ఈమూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈసినిమాను ఐదుగురు దర్శకులు దర్శకత్వం వహిస్తూ ఉండటంతో ఈమూవీ సంచలనాలు సృష్టించడం సహజం అన్నసంకేతాలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈసినిమా కథలోని కొన్ని ఎపిసోడ్స్ ఎంచుకుని ఒకొక్క డైరెక్టర్ ఒకొక్క ఎపిసోడ్ ను దర్శకత్వం వహిస్తారని అంటున్నారు. రాజకీయాల పట్ల బాగా అవగాహన ఉన్న వారికి ఆర్ ఎస్ ఎస్ గురించి బాగా తెలుస్తుంది కానీ సెల్ ఫోన్ మాత్రమే జీవితం అనుకుంటూ కాలం గడిపే చాలమంది తెలియదు. దీనితో ఈమూవీని డాక్యుమెంటరీ లా భావించే ఆస్కారం ఉంది అని కొందరు అంటున్నారు. ఈమూవీ వెనుక 5గురు దర్శకులు ఉండటంతో కొంతమేరకు ఈ మూవీని అందరికీ నచ్చేవిధంగా తీసే ఆస్కారం ఉంది అన్నఅంచనాలు కూడ ఉన్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: