తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న యువ నటులలో నిఖిల్ ఒకరు. ఈయన పోయిన సంవత్సరం విడుదల అయినటువంటి "కార్తికేయ 2" మూవీ తో అదిరిపోయే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ ఏకంగా పాన్ ఇండియా మూవీ గా విడుదల అయ్యి ఇండియా వ్యాప్తంగా సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఈ మూవీ తో ఈ నటుడు కి ఇండియా వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇక కార్తికేయ 2 మూవీ తో ఈ నటుడు కి ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించడంతో ఆ తర్వాత నిఖిల్ "స్పై" అనే మరో పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించాడు.
ఈ మూవీ కి గర్రీ బిహెచ్ దర్శకత్వం వహించగా ... ఐశ్వర్య మీనన్ ఈ మూవీ లో నిఖిల్ సరసన హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న నిఖిల్ "స్పై" మూవీ ఫ్లాప్ కావడానికి గల కారణాన్ని వివరించాడు.
తాజా ఇంటర్వ్యూ లో భాగంగా నిఖిల్ మాట్లాడుతూ ... స్పై మూవీ షూటింగ్ ఇంకా పది రోజులు మిగిలి ఉన్న సమయం లోనే త్వర త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను చేసేసి ఆ సినిమాకు సంబంధించిన పూర్తి ప్రోడక్ట్ రాకముందే ఆ మూవీ ని విడుదల చేశారు. ఆ కారణంతో స్పై మూవీ జనాలకు పెద్దగా నచ్చలేదు. దానితో ఆ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది అని నిఖిల్ చెప్పుకొచ్చాడు. ఇకపోతే ప్రస్తుతం నిఖిల్ చేతిలో అనేక క్రేజీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. వాటిపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.