మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి వివాహం ఇటలీలోని టస్కానీలో నవంబర్ 1వ తేదీన గ్రాండ్‌గా జరగనుంది.ఈ పెళ్లి వేడుకకు కొణిదెల మరియు అల్లు కుటుంబ సభ్యులు అందరూ హాజరుకానున్నారు.. మెగా, అల్లు హీరోలు వారి కుటుంబ సభ్యులతో వివాహ వేడుకల్లో పాల్గొనబోతున్నారు.ఇప్పటికే కొణిదెల, అల్లు కుటుంబాల్లో వివాహ సంబరాలు జోరుగా సాగుతున్నాయి. ఇక, వరుణ్, లావణ్య పెళ్లికి హాజరయ్యేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేడు (అక్టోబర్ 28) ఇటలీకి బయలుదేరారు.అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా నేడు ఇటలీకి బయలుదేరారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో వారు విమానం ఎక్కారు. అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహా రెడ్డి మరియు వారి పిల్లలు అయాన్, ఆర్హ ఇటలీకి వెళ్లారు. హైదరాబాద్ విమానాశ్రయంలోకి వీరు కనిపించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. అల్లు అర్జున్ బ్లాక్ ఔట్ఫిట్ ధరించారు. ఫుల్ స్లీవ్డ్ టీ షర్ట్, బ్లాక్ జాగర్స్, స్నీకర్స్ వేసుకున్నారు. స్నేహారెడ్డి.. డెనిమ్ జాకెట్, డెనిమ్ ప్యాంట్స్, బ్లాక్ క్రాప్ టాప్ ధరించారు.వరుణ్, లావణ్య వివాహానికి హాజరయ్యేందుకు ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన భార్య అన్న లెజనోవాతో కలిసి ఇటలీ వెళ్లారు. అలాగే యంగ్ హీరో నితిన్, అతడి భార్య షాలినీ కూడా విమానాశ్రయంలో కనిపించారు.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకలు టస్కానీలో అక్టోబర్ 30వ తేదీ నుంచే మొదలుకానున్నాయి. ఆరోజున కాక్ టైల్ పార్టీ ఉంటుందత. అక్టోబర్ 31న మెహందీ మరియు హల్దీ వేడుకలు జరుగుతాయి. నవంబర్ 1న వివాహం జరుగుతుంది. కొణిదెల, అల్లు కుటుంబాలతో పాటు అత్యంత సన్నిహితులు ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు హాజరుకానున్నారని తెలుస్తుంది.నవంబర్ 5వ తేదీన వరుణ్, లావణ్య వివాహ రిసెప్షన్ హైదరాబాద్‌లో ఘనంగా జరగనుంది. ఈ రిసెప్షన్‌కు అనేక మంది సినీ, రాజకీయ మరియు పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతారు.ఆరేళ్ల పాటు ఎంతగానో ప్రేమించుకున్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంట ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు.