"పొలిమేర 2" సెన్సార్ కార్యక్రమాలు పూర్తి పూర్తి... రన్ టైమ్ లాక్..!

Pulgam Srinivas
సత్యం రాజేష్ , బాలాదిత్య , గెటప్ శ్రీను ప్రధాన పాత్రలో రూపొందిన "మా ఊరి పొలిమేర" సినిమా పెద్దగా ఎలాంటి అంచనాలు లేకుండా నేరుగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయ్యి ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలను అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ మూవీ కి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి దక్కడంతో తాజాగా మా ఊరి పొలిమేర సినిమా దర్శకుడు ఈ సినిమాకు కొనసాగింపుగా "మా ఊరి పొలిమేర 2" అనే పేరుతో మరో మూవీ ని రూపొందించాడు.


ఈ మూవీ ని నవంబర్ 3 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ యొక్క రన్ టైమ్ ను కూడా లాక్ చేసినట్లు సమాచారం. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి "ఏ" సర్టిఫికెట్ లభించినట్లు తెలుస్తుంది.


అలాగే ఈ మూవీ బృందం ఈ సినిమాను 2 గంటల 7 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే మా ఊరి పొలిమేర మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ రెండవ భాగం పై తెలుగు సినీ ప్రేమికులు భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ రెండవ భాగం ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: