లియో షాక్ వల్ల ఆ మూవీలని చెక్కుతున్న లోకేష్?

Purushottham Vinay
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ లొకేష్ కనగరాజ్ యూనివర్శ్ నుంచి రాబోతున్న  ఖైదీ-2..రొలెక్స్ సినిమాల కోసం తమిళ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా పూర్తయిన వెంటనే లోకేష్ `ఖైదీ-2` సినిమాని పట్టాలెక్కిస్తాడు. ఇంకా అలాగే రోలెక్స్ టైటల్ తోనే ఓ సినిమా సపరేట్ గా చేస్తున్నాడు. పైగా ఈ రెండు సినిమాలకు ఇంటర్ లింక్ ఉంది.ఎల్ సీ యూ నుంచి రాబోతున్న సినిమాలు కావడంతో రెండింటిపై చాలా భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో సూర్య జపాన్ ప్రచారంలో భాగంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. లొకేష్ కనగరాజ్ నాకిచ్చిన రోలెక్స్ పాత్ర అయితే పూర్తిగా నా కెరీర్ నే మార్చేసింది. ఢిల్లీ ఎప్పుడైతే రిటర్న్ అవుతాడో? అదే సమయంలో రోలెక్స్ కూడా తిరిగి వస్తాడు` అని ఆయన అన్నారు. దీంతో `ఖైదీ-2` లో రోలెక్స్ పాత్ర చాలా బలంగా ఉండబోతుందని సంకేతాలు అందేసాయి.


అన్నదమ్ముల మధ్య రీల్ వార్ పీక్స్ లోనే ఉంటుందని అప్పుడే గెస్సింగ్స్ మొదలైపోయాయి.ఇక ఇదే యూనివర్శ్ నుంచి విక్రమ్ -2 సినిమా కూడా రానుంది. ఇదంతా కూడా లోకేష్ కనగరాజ్ సృష్టించుకున్న సామ్రాజ్యం. వాటి నుంచి ఒక్కొక్కటిగా వచ్చి ప్రేక్షకుల్ని థ్రిల్ చేయనున్నాయి. సక్సెస్ అయినంత కాలం లోకేష్ యూనిర్శ్ అనేది కొనసాగుతుంది. సైమల్టేనియస్ గా లోకేష్ నుంచి కొత్త చిత్రాలు కూడా వస్తుంటాయి. వాటిలో ఇతర హీరోలు కూడా కనిపిస్తారు. ప్రస్తుతం లోకేష్ కొనగరాజ్ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాపై ఫుల్ వర్క్ చేస్తున్నారు.ఇక `లియో` సినిమాపై వచ్చిన నెగిటివిటీ ని తొలగించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక సూర్య..కార్తీలు వేర్వరు ప్రాజెక్ట్ లతో బాగా బిజీగా ఉన్నారు. వాటిని పూర్తిచేసిన వెంటనే ఆ హీరోలు లోకేష్ టీమ్ తో జాయిన్ అవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: