రామ్ ఓవరాక్షన్ ఫిలిమ్స్ స్కంద ఓటీటి డేట్ లాక్..!!
వాస్తవానికి ఈ సినిమా అక్టోబర్ 27న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రిమింగ్ కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత ఈ సినిమా నవంబర్ రెండవ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఐదు భాషలలో ట్రిమ్మింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన కూడా చిత్ర బృందం తెలియజేయడం జరిగింది. అయితే స్కంద సినిమాకి సంబంధించి సీక్వెల్ ని కూడా చిత్ర బృందం ప్రకటించడం జరిగింది. మొదటి భాగమే పెద్దగా ఆకట్టుకోలేకపోయిన స్కంద సినిమా రెండో భాగం రావడం అంటే చాలా కష్టమని అభిమానులు భావిస్తూ ఉన్నారు.
ఈ సినిమాతో కూడా అతి తక్కువ నష్టాలతో రామ్ గట్టెక్కించారని తెలుస్తోంది. ఈ సినిమాలో శ్రీ లీల డాన్సులు అదిరిపోయాయని..సాయి మంజ్రేకర్ కీలకమైన పాత్రలో నటించిందని తెలుస్తోంది. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించడం జరిగింది. బోయపాటి శ్రీను తనదైన స్టైల్ లో ఈ సినిమాని తెరకెక్కించిన కథనం బాగానే ఉన్నా ఓవర్ యాక్షన్ సన్నివేశాలతో ఓవర్ డైలాగులతో పొలిటికల్ పరంగా ఈ సినిమాని చాలా వల్గర్ గా చూపించడంతో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాతో బోయపాటి శ్రీను పని అయిపోయిందని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి.