సినిమా పాత్ర కోసం.. కొన్ని వారాలు స్నానం చేయలేదు : హీరోయిన్

praveen
సాధారణంగా తెరమీద ఎంతో అందంగా కనిపించే సినిమా నటులు ఇక ఎలాంటి కష్టం లేకుండానే కోట్ల రూపాయలు సంపాదిస్తుంటారని.. కెమెరా ముందుకాసేపు నటిస్తే చాలు ఇక వాళ్ళ పని పూర్తవుతుందని ఎంతోమంది ప్రేక్షకులు భావిస్తూ ఉంటారు. కానీ ఇక అటు సినిమాల్లోని పాత్రల కోసం నటీనటులు పడే కష్టం అంతా ఇంతా కాదు అన్న విషయం ఇక ఆయా నటులు ఓపెన్ అయ్యి పలు ఇంటర్వ్యూలలో చెప్పినప్పుడే ప్రతి ఒక్కరికి అర్థం అవుతూ ఉంటుంది. ఏమో అనుకున్నాం కానీ సినిమా నటుల కి కూడా ఇంత కష్టం ఉంటుందా అని ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఒకప్పుడైనా పాత్ర కోసం ఏదైనా చేయడానికి వెనకడుగు వేసే వారేమో కానీ.. ఇప్పుడు పాత్రలో పరకాయ ప్రవేశం చేయడానికి ఎలాంటి కష్టాన్నైనా భరిస్తున్నారు స్టార్ నటీనటులు.


 ఈ క్రమంలోనే పాత్రల కోసం భారీగా బరువు పెరిగిపోవడం లేదంటే బక్క చిక్కి పోవడం లాంటివి కూడా చేస్తూ ఉన్నారు. ఇంకొంతమంది ఏకంగా మేకప్ వేసుకోకుండా నటించడం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక కొన్ని పాత్రల కోసం ప్రత్యేకంగా కొన్ని నెలలపాటు కష్టపడి భాషను నేర్చుకోవడం చేస్తున్నారు ఇంకొంతమంది నటులు. ఇక్కడ ఒక హీరోయిన్ కూడా ఒక పాత్ర కోసం ఇలాగే కష్టపడిందట. ఏకంగా పాత్ర కోసం కొన్ని రోజులపాటు స్నానం చేయకుండా ఉందట. అంతేకాదు పాత్రకు సరిపోయేలా చర్మం కనిపించేందుకు బురదలో కూడా దొర్లిందట ఆ హీరోయిన్. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ నటి తార సుతారియ.


 నిఖిల్ నగేష్ బట్ తెరకెక్కించిన అపూర్వ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. తార సుతారియా. ఈ క్రమంలోనే ఈ మూవీలో తన పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ పాత్ర కోసం తనను తాను చాలా మార్చుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది. వారాల తరబడి స్నానం చేయకుండానే ఉన్నాను అంటూ తెలిపింది. ఇక ఆ క్యారెక్టర్ కు తగ్గ చర్మం కోసం ఏకంగా బూరదలో దొర్లినట్టు చెప్పుకొచ్చింది. అంతేకాదు చాలా రోజులపాటు జుట్టును కూడా దువ్వుకోలేదు అన్న విషయాన్ని తెలిపింది. మూవీలోని ప్రతిషాట్లో కూడా డూప్ లేకుండా తానే నటించాలని ఆ విషయాన్ని గర్వపడుతున్నాను అంటూ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: