ఏంటి.. నాచురల్ బ్యూటీ సాయి పల్లవి కూడా.. సర్జరీ చేయించుకుందా?
సినిమా అవకాశాలు వచ్చిన రాకపోయినా పర్వాలేదు కానీ తాను పెట్టుకున్న రూల్స్ ని మాత్రం బ్రేక్ చేయను అంటూ ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే పేరు తీసుకువచ్చే మంచి పాత్రలు వచ్చినప్పుడే నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉంది. అయితే ఇప్పుడు సాయి పల్లవి కి సంబంధించిన ఒక విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది. సాధారణంగా ఎంతో మంది హీరోయిన్లు బాడీలోని కొన్ని పార్ట్ లను మరింత అందంగా మార్చుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవడం చేస్తూ ఉంటారు. ఈ విషయాలను చాలా మంది హీరోయిన్లు సోషల్ మీడియాలో బహిరంగంగానే వెల్లడించారు.
అయితే సాయి పల్లవి మాత్రం ఇప్పటివరకు సర్జరీలో జోలికి పోలేదని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఈ హీరోయిన్ సైతం సర్జరీ చేయించుకుంది అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది. పెద్దగా మేకప్ వేసుకోవడానికి కూడా ఇష్టపడని సాయి పల్లవి సర్జరీ చేయించుకోవడం ఏంటి అని అందరూ షాక్ అవుతున్నారు. అయితే ఈమె అందం కోసం శరీరంలోని ఏ భాగానికి సర్జరీ చేయించుకోలేదు. కానీ డాన్స్ అంటే పిచ్చి ప్రేమ ఉన్న సాయి పల్లవి కాలికి గాయమైందట. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కాలికి సర్జరీ చేయించుకోవాల్సి వచ్చిందని సమాచారం అందరిలా అందం కోసం కాదు తన ఆరోగ్యం కోసం సర్జరీ చేయించుకుందుట సాయి పల్లవి.