ఆయనతో నటించటం నా అదృష్టం అంటున్న హీరో శ్రీకాంత్?
ఇక ఇటీవల ఏకంగా విలన్ గా కూడా అవతారం ఎత్తాడు శ్రీకాంత్. ఇకపోతే ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాంత్ ఒక హీరోతో కలిసి నటించడం అదృష్టం అంటూ కామెంట్ చేసాడు. ఆ హీరో ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి దర్శకత్వంలో.. 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా శంకర్ దాదా ఎంబిబిఎస్. ఈ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే నవంబర్ 4వ తేదీన ఈ మూవీని రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇటీవల ట్రైలర్ ను మెగా బ్రదర్ నాగబాబు, హీరో శ్రీకాంత్ రిలీజ్ చేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ మాట్లాడుతూ.. 2004ను నేను అస్సలు మర్చిపోలేను. హీరోగా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో మున్నాభాయ్ లగే రహో రీమేక్ వార్త వినిపించింది. హీరో పక్కన ఉండే క్యారెక్టర్ నాకు ఎలా ఉంటుంది అన్నయ్య అని చిరంజీవిని అడిగాను. ఆయన అలా నవ్వి ఊరుకున్నారు. కానీ చివరికి ఆ పాత్ర నాకే వచ్చింది. అన్నయ్యతో కలిసి నటించే అవకాశం రావడం నిజంగా నాకు అదృష్టం. ఆ సినిమాలో నన్ను అన్నయ్య ఏటీఎం అని పిలిచేవారు. ఇప్పటికీ కూడా నేను ఎప్పుడు కలిసినా ఏటీఎం అని పిలుస్తూఉంటారు అంటూ చెప్పుకొచ్చాడు శ్రీకాంత్. ఇక ఈ సినిమా రి రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు.