బేబీ తరహాలో మరో లవ్ స్టోరీ.. హీరోయిన్ గా బిగ్ బాస్ బ్యూటీ?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాలు గా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన మూవీస్ ఎంత సెన్సేషనల్ విజయాలు సాధిస్తున్నాయో ప్రత్యేకంగా పని లేదు. ఇలాంటి మూవీస్ లో బేబీ మూవీ కూడా ఒకటి అని చెప్పాలి. సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ యూత్ అందరికి కూడా బాగా కనెక్ట్ అయింది. నేటి రోజుల్లో యూత్ మధ్యలో లవ్ స్టోరీ ఎలా ఉన్నాయి అన్నదాన్ని కళ్ళకు కట్టినట్టుగా బేబీ మూవీ లో చూపించడంలో సక్సెస్ అయ్యాడు సాయి రాజేష్. దీంతో ఈ చిన్న సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. అయితే ఇక ఇప్పుడు మరోసారి ఇలాంటి సినిమాతోనే ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు ఈ దర్శకుడు.


 ఈ క్రమంలోనే ఈ సినిమాలో యువ నటుడు సంతోష్ శోభన్ హీరోగా కనిపించబోతున్నాడు. అయితే బిగ్ బాస్ షో ద్వారా ప్రేక్షకులందరికీ కూడా బాగా దగ్గరైన అల్లరి పిల్ల అలేఖ్య హారిక ఇక మూవీలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాకి సాయి రాజేష్ కథ అందించి నిర్మాతక వ్యవహరిస్తుండగా.. సుమన్ పాతూరి దర్శకత్వం వహిస్తున్నారు. మాస్ మూవీ మేకర్స్ పథకంపై శ్రీనివాస కుమార్, సాయి రాజేష్ సంయుక్తంగా మూవీల నిర్మిస్తూ ఉండడం గమనార్హం. అయితే ఇటీవల సినిమా పూజా కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించారు. అక్కినేని నాగచైతన్య ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టారు.



 ఇక ఈ సినిమాతో అటు తెలుగు చిత్ర పరిశ్రమకు హారిక హీరోయిన్గా పరిచయం కాబోతున్నారు. అయితే ఇంటర్నెట్ జనాలకు హారిక కొత్తేమీ కాదు. ఇప్పటివరకు తన వీడియోలతో ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాదు ఇక బిగ్ బాస్ షో ద్వారా కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. కాగా హీరో హీరోయిన్ లిప్ లాక్ తో ఉన్న ఫోటో ఇటీవల మేకర్స్ రిలీజ్ చేశారు. ఇది చూస్తే ఫుల్ రొమాంటిక్ మూవీ అని తెలుస్తుంది. అయితే బేబీ మూవీ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ ఇచ్చిన కథ కావడంతో ఈ సినిమాపై మరోసారి భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: