ఏంటీ.. హీరో సుహాస్.. కొరియోగ్రాఫర్ అవ్వాలని వచ్చి యాక్టర్ అయ్యాడా?

praveen
ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో సుహాస్ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. మిగతా హీరోల సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ కెరియర్ ని ప్రారంభించిన సుహాస్ ఇక విభిన్నమైన కథలను ఎంచుకుంటూ హీరోగా కూడా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఛాన్సులు దక్కించుకుంటూ  కీలక పాత్రల్లో నటిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. మొన్నటికి మొన్న భారీ అంచనాల మధ్య విడుదలైన హిట్ 2 సినిమాలో కూడా విలన్ పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు.


 ఇక ఇప్పుడు సుహాస్ హీరోగా అంబాజీపేట మ్యారేజి బ్యాండు అనే సినిమా ఒకటి ప్రేక్షకుల  ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుంది. ఈ సినిమా విడుదలకు రెడీగా ఉంది అని చెప్పాలి. దీంతో ప్రస్తుతం సుహాస్ ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నాడు. ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని కూడా రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ మూవీలో సుహాస్ అల్లు అర్జున్ అభిమానిగా కనిపించబోతున్నాడట. ఇకపోతే ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు సుహాస్. తన కెరియర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను కొరియోగ్రాఫర్  అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చాను. కానీ యాక్టర్ అయ్యాను అంటూ చెప్పాడు సుహాస్.


 అంతేకాదు అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ సినిమాలో అల్లు అర్జున్ అభిమానిగా కనిపిస్తాను. రియల్ లైఫ్ లో కూడా ఆయన అభిమానినే. ఆర్య సినిమా నుంచి ఆయనను చూసి డాన్స్ నేర్చుకోవడం మొదలుపెట్టాను. ఇక కొరియోగ్రాఫర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను. కానీ ఇక ఇప్పుడు యాక్టర్ గా మారిపోయాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు వరకు డాన్స్ ని సినిమాలో ఎక్కడా టచ్ చేయని సుహాస్.. అటు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాలో మాత్రం డాన్స్ తో ఇరగదీసే అవకాశాలు ఉన్నాయి అన్నది తెలుస్తుంది. తన కొత్త టాలెంట్ తో ప్రేక్షకులను ఎంతవరకు ఇంప్రెస్ చేయగలడో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: