యానిమల్ హింసని జనం తట్టుకోగలరా ?

Seetha Sailaja
వచ్చేనెల ఫస్ట్ కు విడుదల కాబోతున్న రణబీర్ కపూర్ సందీప్ వంగ ల భారీ బడ్జెట్ మూవీ ‘యానిమల్’ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈమూవీకి సంబంధించిన ట్రైలర్ కు ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన రావడంతో ఈసినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అన్నఅంచనాలు మధ్య బాలీవుడ్ ఉంది.



ఈమూవీని తెలుగు తమిళ కన్నడ భాషలలొ కూడ డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈమూవీ పై వస్తున్న ఒక షాకింగ్ న్యూస్ చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. ఈసినిమాకు సంబంధించి  ఒళ్ళు గగుర్పొడిచే వయలెన్స్ చాల ఉంటుందని హీరో రణబీర్ కపూర్ లీకులు ఇస్తున్నాడు.



అంతేకాదు ఈమూవీలో విలన్ల బ్యాచ్ ని నరమాంసం తినే భక్షకులుగా చూపిస్తారు అన్న వార్తలు కూడ ఉన్నాయి. హాలీవుడ్ లో క్యానిబాల్స్ సంస్కృతి మీద చాలా సినిమాలొచ్చాయి కానీ మన తెలుగులో అటువంటి కాన్సెప్ట్ తో కూడిన సినిమాలాను ఎవరు సాహసించే ప్రయత్నం చేయలేకపోయారు అని అంటారు. అయితే సందీప్ వంగా మాత్రం తనయ యానిమల్ మూవీలో విపరీతంగా వయలన్స్ ఉన్నప్పటికీ అది సినిమా కథలో భాగంగా కనిపిస్తుంది కాబట్టి దానివల్ల ప్రేక్షకులకు ఎటువంటి అసహనం ఏర్పడదు అని అంటున్నారు.



అంతేకాదు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టే మూవీగా తన యానిమల్ ఉంటుందని అంచనాలను ఈమూవీ దర్శక నిర్మాతలు పెంచుతున్నారు. రణబీర్ కపూర్ కుటుంబం చేసే హత్యలు దారుణాలు ఒక రేంజ్ లో ఉంటాయని ఈసినిమాను ప్రమోట్ చేస్తూ రణబీర్ కపూర్ లీకులు ఇస్తూ ఉండటంతో ఇంత భారీ హింసను తెలుగు ప్రేక్షకులు తట్టుకోగలరా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీనికితోడు సినిమాలో సెంటిమెంట్ లేకుండా కేవలం కథ మొత్తం వయలెన్స్ తో నిండిపోతే సినిమాలను బాగా చూసే ఫ్యామిలీ ప్రేక్షకులు ‘యానిమల్’ మూవీని పక్కకు పెట్టెప్రమాదం ఉంది అంటూ మరికొందరు కామెంట్స్ కూడ చేస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: