ట్రైలర్: రీ ట్రైలర్ దుమ్ము దులిపేస్తున్న పోలిమేర -2

Divya
సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మా ఊరి పొలిమేర -2 ఈనెల మూడవ తేదీన చాలా గ్రాండ్ గా విడుదల కాపరుతోంది. డాక్టర్ అనిల్ విశ్వనాధ్ దర్శకత్వం లో వస్తున్న ఈ హారర్ త్రిల్లర్ చిత్రం గా తెరకెక్కిస్తూ ఉన్నారు. పొలిమేర సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కించిన పొలిమేర-2 సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో.. హైదరాబాదులో ప్రి రిలీజ్ ఈ వెంట్ ను కూడా నిర్వహించడం జరిగింది. తాజాగా ఈ సినిమా రీ రిలీజ్ ట్రైలర్ ని కూడా విడుదల చేయడం జరిగింది.


భారీ అంచనాల మధ్య ఈ సినిమా రేపటి రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో ఈ ట్రైలర్ కూడా మరింత ఆసక్తిని పెంచేలా కనిపిస్తోంది. ట్రైలర్ విషయానికి వస్తే.. ఊర్లో అందరూ మంచిగా ఉన్నారా అంటూ సత్యం రాజు చెప్పే డైలాగ్ గెటప్ శ్రీను తో ఈ సినిమా ట్రైలర్ మొదలవుతుంది. ఆ సమయంలోనే గెటప్ శ్రీను.. నువ్వు సచ్చినావని అందరూ అనుకుంటున్నారా ఊర్లో అని చెప్పగా.. నీ భార్య మాత్రం నువ్వు బతికున్నావనే నిజాన్ని మోయాలో దాయాలు తెలియక రోజు సతమతమవుతోంది అంటూ తెలుపుతారు.


పొలిమేర-1 సినిమా చేతబడి కాన్సెప్ట్ లో ఈ సినిమా అందరికీ గూస్ బంప్స్ తెప్పించిన సత్యం రాజేష్ అదే కాన్సెప్ట్ తో పొలిమేర-2 కంటిన్యూ చేయవలసినట్లు ఈ ట్రైలర్లో చూపించారు. హాట్ స్టార్ లో మొదటి భాగం వీక్షించిన ప్రేక్షకులు రెండవ భాగం కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ నిర్మాత బన్నీ వాసు సౌజన్యంతో విచిత్రాన్ని చాలా గ్రాండ్గా నిర్వహిస్తున్నారు. బ్లాక్ మ్యాజిక్ చుట్టు తిరిగే నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించారు. మేకర్స్ రెండవ భాగాన్ని డైరెక్ట్ గా థియేటర్లో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు మరి థియేటర్లో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందేమో చూడలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: