గుంటూరు కారం... దేవర సినిమా షూటింగ్ వివరాలు ఇవే..!
గుంటూరు కారం : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తూ ఉండగా మీనాక్షి చౌదరి , శ్రీ లీల ఈ మూవీ లో హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ షూటింగ్ వివరాల్లోకి వెళితే ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు రోడ్డు యాక్షన్స్ సన్నివేశాన్ని మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తుంది. ఈ సన్నివేశం ఈ సినిమాలో హైలైట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
దేవర : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ కి కొరటాల శివ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... జాన్వి కపూర్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించనుండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ మొత్తం రెండో భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో మొదటి భాగాన్ని వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ వివరాల్లోకి వెళితే ... ప్రస్తుతం ఈ మూవీ బృందం గోవా లో ఎన్టీఆర్ పై ఈ సినిమాకు సంబంధించిన అత్యంత కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది. ప్రస్తుతం గోవాలో చిత్రీకరిస్తున్న సన్నివేశాలు అదిరిపోయే రేంజ్ లో వస్తున్నట్లు తెలుస్తోంది.