నాగార్జున నిర్ణయం గురించి ఎదురుచూపులు !

Seetha Sailaja
దసరా రేస్ రిజల్ట్ తెలిసి పోవడంతో ఇక అందరి దృష్టి తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి సినిమాల రేస్ పై ఉంది. ఎప్పుడూ లేని విధంగా అనేకమంది టాప్ హీరోల సినిమాలు ఈ సంక్రాంతి రేస్ కు రావడంతో ఇన్ని సినిమాలకు తెలుగు రాష్ట్రాలలో అసలు ధియేటర్స్ ఎక్కడ దొరుకుతాయి అన్న ప్రశ్నకు ఇండస్ట్రీ వర్గాలు కూడ సరైన సమాధానాలు ఇవ్వలేకపోతున్నాయి.



ఏకంగా ఈసారి సంక్రాంతి రేస్ కు ఆరు సినిమాలు తమ రిలీజ్ డేట్స్ ను ప్రకటించడంతో చివరి నిముషంలో కనీసం వీటిలో మూడు సినిమాలు రేస్ నుండి తప్పుకుంటాయి అన్న ఊహాతో ఇండస్ట్రీ వర్గాలు ఉన్నాయి. అయితే దసరా పండుగ సందర్భంగా ఈసినిమాలు అన్నీ తమ రిలీజ్ డేట్ సంక్రాంతికి పక్కా అంటూ ప్రకటనలు ఇవ్వడంతో కన్ఫ్యూజన్ మరింత పెరిగి పోతోంది.



తెలుస్తున్న సమాచారం మేరకు ఎవరికి వారు తమ సినిమాల సంక్రాంతి రిలీజ్ డేట్ లో మార్పులేదు అంటూ లీకులు ఇస్తూ ఉండటం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ‘గుంటూరు కారం’ ‘ఫ్యామిలీ స్టార్‘ హనుమాన్’ ‘ఈగల్’ ‘సైంధవ్’ సినిమాలకు సంబంధించిన సంక్రాంతి రిలీజ్ డేట్ ప్రకటనలు మళ్ళీ రావడంతో ఇక ఈ సినిమాలు అన్నీ సంక్రాంతి రేస్ లో పోటీ పడటం ఖాయం అని అంటున్నారు. అయితే ఈ లిస్టులో నాగార్జున నటిస్తున్న ‘నాసామిరంగ’ మూవీ రిలీజ్ డేట్ ప్రకటన మళ్ళీ లేకపోవడంతో ఈ రేస్ నుండి నాగార్జున తప్పుకున్నాడా అన్న సందేహాలు వస్తున్నాయి.



దీనికితోడు ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్స్ ప్రస్తుతం ఎక్కడా కనిపించక పోవడంతో వాస్తవానికి ఈసినిమా షూటింగ్ జరుగుతోందా లేక ఇంకా మొదలుకాలేదా అన్న సందేహాలు ఇండస్ట్రీలో కొందరికి వస్తున్నాయి. ఒకవేళ నాగ్ సినిమా ఈ సంక్రాంతి రేస్ నుండి తప్పుకున్నా ఏకంగా ఐదు సినిమాలు సంక్రాంతిని టార్గెట్ చేస్తే సినిమాల కలక్షన్స్ డివైడ్ అవుతాయి కదా అంటూ ఈ మూవీ బయ్యర్లు కలవర పడుతున్నట్లు టాక్..  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: