జక్కన్న డైరెక్షన్.. అజిన్ - అల్లు అర్జున్ హీరోలు.. నిజమేనా?
ఏకంగా రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకుడు.. త్రిబుల్ ఆర్ లాంటి మల్టీస్టారర్ సినిమా తీసి వరల్డ్ వైడ్ సూపర్ హిట్ కొట్టాడు. దీంతో ఇండస్ట్రీలో మల్టీస్టారర్ హవా మరింత పెరిగిపోయింది. ఇప్పుడు మరో మల్టీస్టారర్ సినిమా గురించిన వార్త తెర మీదకి వచ్చింది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కలిసి ఒక మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నారట. ఇక వీరిద్దరు చేయబోయే సినిమాకి స్టోరీ అందించింది ఒక క్రేజీ రైటర్ అని తెలుస్తుంది. ఆయన ఎవరో కాదు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్. ఇప్పటికే విజయేంద్రప్రసాద్ తన కథలతో ఎంతటి సెన్సేషన్ సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇప్పుడు కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్, టాలీవుడ్ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ మల్టీస్టారర్ కోసం ఒక క్రేజీ స్టోరీని సిద్ధం చేస్తున్నాడట విజయేంద్ర ప్రసాద్. ఇప్పటికే ఒక స్టోరీ లైన్ అనుకున్నారని.. ప్రస్తుతం డైలాగ్స్ రాస్తున్నారని ఒక టాక్ వినిపిస్తుంది. అంతేకాదు మరో క్రేజీ న్యూస్ ఏంటో తెలుసా ఈ సినిమాకు రాజమౌళి డైరెక్టర్గా వ్యవహరించబోతున్నాడట. అయితే ప్రస్తుతం మహేష్ సినిమా తర్వాత ఇక ఈ సినిమానే తెరమీదికి తీసుకురాబోతున్నాడట జక్కన్న. ఇక ఈ సినిమా కోసం అజిత్, అల్లు అర్జున్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఒక వార్త ఇండస్ట్రీలో తెగచక్కర్లు కొడుతుంది. ఇది ఎంతవరకు నిజమో చూడాలి మరి.