రజిని సినిమాలో విలన్ గా.. ప్రభాస్ దర్శకుడు?

praveen
సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. మొన్నటి వరకు ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన ఆ సినిమాలు పెద్దగా హిట్ కాలేకపోయాయి. దీంతో రజనీకాంత్ కొత్త ట్రెండుకు తగ్గట్టుగా సినిమాలు చేయలేకపోతున్నారు అంటూ కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఇటీవల నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ సినిమా అయితే ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


 ఇక ఈ సినిమాలో రజనీకాంత్ తో పాటు మరో ఇద్దరు స్టార్ హీరోలు మోహన్లాల్, శివ రాజ్ కుమార్ లు కూడా కీలకపాత్రలో నటించారు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన రజిని వరుసగా సినిమాలను ఒప్పుకుంటూ బిజీబిజీగా ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక తన సినిమాలతో ఒక ప్రత్యేకమైన యూనివర్స్ క్రియేట్ చేసి గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ లోకేష్ కనకరాజుతో ఒక మూవీని చేస్తున్నారు సూపర్ స్టార్ రజిని. ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.


 అయితే ఇలా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా చేస్తున్న సినిమాలో ఏకంగా రజినిని ఢీకొట్టే విలన్ పాత్రలో రాఘవా లారెన్స్ నటించిన బోతున్నాడట. అయితే ఇప్పటికే ఎన్నో సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, దర్శకుడిగా, డాన్స్ మాస్టర్ గా బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగి పోతాడు లారెన్స్ దీంతో. విలన్ గా లారెన్స్ను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కాబోతుందట. అయితే త్వరలోనే ఇక లారెన్స్ ను విలన్ పాత్ర కోసం ఎంపిక చేసినట్లు మూవీ టీం అధికారికంగా ప్రకటించబోతున్నట్లు టాక్. అయితే రాఘవ లారెన్స్ ప్రభాస్ హీరోగా వచ్చిన రెబల్ సినిమాకు దర్శకత్వం వహించడమే కాదు పల సినిమాలకు కూడా డైరెక్టర్గా వ్యవహరించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: