ట్రైలర్: ఎమోషనల్ గా హార్ట్ టచ్ చేస్తున్న సప్త సాగరాలు దాటి సైడ్ -B ట్రైలర్..!!

Divya
కన్నడ హీరో రక్షిత్ శెట్టి నటించిన కన్నడ చిత్రం సప్తసాగర దాచే ఎల్లో.. అక్కడ భారీ విజయనందుకోవడంతో తెలుగులో సప్త సాగరాల దాటి అనే పేరుతో విడుదల చేశారు. రుక్మిణి వసంత్ ఇందులో హీరోయిన్ గా నటించడం జరిగింది.హేమంత్ రావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ -22 న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి వివాహమైన తర్వాత చిన్న జాబ్ చేసుకుంటూ సిటీలో ఉంటారు..ఎవరో చేసిన యాక్సిడెంట్ కేసును హీరో డబ్బుల కోసం ఒప్పుకొని త్వరగా బయటికి వచ్చి ఆ డబ్బులతో ఇల్లు కట్టుకుందామని తన భార్యని ఒప్పిస్తారు అలా జైలుకు వెళ్లడం జరుగుతుందట.



అయితే ఆ కేసు ఒప్పుకోమని చెప్పిన వాళ్ళు చనిపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో హీరో పదేళ్లపాటు జైల్లోనే ఉండాల్సి వస్తుంది. ఈ కథని పార్టు వన్ సైడ్ ఎ అంటూ కూడా చాలా అందంగా తెరకెక్కించారు. ఆ తర్వాత హీరో జైలు నుంచి బయటికి రావడం ఆ తర్వాత ఏం చేశారు అనేకదాంశంతో పాటు పార్ట్ -2 తో తెరకెక్కించారు. తాజాగా సప్త సాగరాలు దాటి సైడ్ -B వంటి ట్రైలర్ ని విడుదల చేయడం జరిగింది.


ఈ సైడ్ బి లో హీరో బయటికి వచ్చి ఏం చేస్తారు తన భార్యను మళ్ళీ కలుస్తారా లేదా కలిసి ఏం చేశారు ఎలా ఉండబోతున్నారు అనే కదా అంశంతో తెరకెక్కించినట్లుగా ఈ ట్రైలర్లు కనిపిస్తోంది. ఈ ట్రైలర్ ని సమంత రిలీజ్ చేయడం జరిగింది ఈసారి తెలుగు కన్నడ తమిళ్ మలయాళం వంటి భాషలో ఒకేసారి ఈ సినిమాని నవంబర్ 17న థియేటర్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఏవిధంగా మెప్పిస్తుందో చూడాలి. ప్రస్తుతం ఈ ట్రైలర్ మాత్రం వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: