గుంటూరు కారం సినిమా నుంచి మసాలా సాంగ్ ప్రోమో వైరల్..!!

Divya
మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న గుంటూరు కారం సినిమా గురించి అప్డేట్ రావడంతో అభిమానులు సైతం తెగ సంబరపడిపోతున్నారు. ముఖ్యంగా ఇందులో హీరోయిన్స్ గా శ్రీ లీల, మీనాక్షి చౌదరి నటిస్తూ ఉండడంతో ఈ సినిమాకు మరింత హైప్ ఏర్పడుతోంది. మహేష్ అభిమానులు చాలా ఆత్రుతగా ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన ఈ సినిమాని విడుదల చేయాలని చిత్ర బృందం పక్క ప్రణాళికతోనే షూటింగ్ చేస్తోంది. కొన్ని కారణాల చేత గుంటూరు కారం సినిమా షూటింగ్ వాయిదా పడినప్పటికీ ప్రస్తుతం శరవేగంగా సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

దసరా పండుగ సందర్భంగా ఫస్ట్ సాంగ్ ని విడుదల చేస్తామని నిర్మాత నాగ వంశీ తెలియజేయగా అది దీపావళికి కుదిరినట్టుగా తెలుస్తోంది. ఇటీవలే కొన్ని నిమిషాల ముందు గుంటూరు కారం సినిమాకి సంబంధించి ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేయడం జరిగింది. గుంటూరు కారం నుంచి మసాలా బిర్యాని అనే ఒక పాట కూడా లీక్ అవ్వడంతో చిత్ర యూనిట్ ఫస్ట్ సాంగ్ ధమ్ మసాలా ప్రోమో ని ఈ రోజున విడుదల చేయడం జరిగింది.


ఇందులో ఎలాంటి వీడియో బయటకు చూపించకుండా కేవలం మోషన్ పోస్టర్స్ తోనే ఈ పాటని రిలీజ్ చేయడం జరిగింది. ఫుల్ సాంగ్ త్వరలోనే విడుదల చేస్తామంటూ కూడా ప్రకటించారు. సంగీత దర్శకుడు తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. నవంబర్ 7వ తేదీన మొదటి పాటను విడుదల చేయబోతున్నట్లు ఈ ప్రోమోలో చూపించడం జరిగింది. ఈ ప్రోమో లో మహేష్ బాబు స్టైలిష్ గా సిగరెట్ తాగుతూ కూర్చున్నటువంటి ఫోటోలతో పాటు స్టైలిష్ గా ఏదో హౌస్ లోకి వెళుతున్నట్లుగా చూపించారు. ప్రస్తుతం ఈ ఫస్ట్ సింగిల్ కి సంబంధించి వీడియో మాత్రం వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: