ఐరనే వంచాలా ఏంటి డైలాగ్.. తన వెర్షన్ లో చెప్పిన నాని?
ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ లో విజయ్ దేవరకొండ ఒక ఫైట్ సీన్లో ఐరనే వంచాలా ఏంటి అనే డైలాగ్ చెబుతాడు. ఇక ఇప్పుడు ఇది ఎంతో ఫేమస్ గా మారిపోయింది. ఈ డైలాగు ఎక్కడ వరకు వెళ్లిందంటే.. మిగతా స్టార్ హీరోలు సైతం ఈ డైలాగ్ తమ వర్షన్ లో చెప్పుకొస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే న్యాచురల్ స్టార్ నాని సైతం ఇటీవల తన మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఈ డైలాగు చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చాడు నాని హీరోగా శౌర్యవ్ దర్శకత్వంలో మృణాల ఠాగూర్ హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా హాయ్ నాన్న.
డిసెంబర్ 7వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది అని చెప్పాలి. ఇక నాని వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఇటీవల ఒక కాలేజ్ ను విసిట్ చేశాడు నాని. ఈ క్రమంలోనే స్టూడెంట్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. కమర్షియల్ సినిమాలు కాకుండా లవ్ స్టోరీస్ డిఫరెంట్ సినిమాలు తీస్తూ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నారు ఇది ఎలా సాధ్యం అంటూ ప్రశ్న అడగగా.. నాని విజయ్ దేవరకొండ డైలాగ్ తో సమాధానం చెప్పాడు. బ్లాక్ బస్టర్ కొట్టాలంటే యాక్షన్ సినిమాలే చేయాలా ఏంటి.. మసాలా ఫిలిమ్స్ ఏ చెయ్యాలా ఏంటి అని డైలాగ్ చెప్పాడు నానీ.