ఆ నెలలో పవన్ బ్లాక్ బస్టర్ మూవీ రీ రిలీజ్..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే పవన్ తన కెరియర్ లో నటించిన బ్లాక్ బస్టర్ సినిమాలలో గబ్బర్ సింగ్ మూవీ ఒకటి. ఈ మూవీ కి టాలీవుడ్ టాప్ దర్శకులలో ఒకరు అయినటువంటి హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా ... పరమేశ్వర ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ ఈ మూవీ ని నిర్మించాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించగా ... మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని శృతి హాసన్ i సినిమాలో పవన్ కి జోడిగా నటించింది.


ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో పవన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకులను ... విమర్శకులను ఎంతగానో మెప్పించాడు. ఇకపోతే 2012 వ సంవత్సరం విడుదల అయిన ఈ సినిమా ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇలా ఆ టైమ్ లో ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయడానికి ఈ చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


ఇకపోతే ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో భారీ ఎత్తున రీ రిలీజ్ చేయడానికి ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ మేకర్స్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఖుషి ... జల్సా మూవీ లు రీ రిలీజ్ అయ్యి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ను భారీ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టాయి. మరి గబ్బర్ సింగ్ సినిమా రీ రిలీజ్ అయినట్లయితే ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: