వార్నీ.. బిగ్ బాస్ -7 లో.. ఒకేసారి ముగ్గురు కెప్టెన్లు?
ఇలా కెప్టెన్‌గా వ్యవహరించే కంటెస్టెంట్ అన్ని పనులను కూడా దగ్గరుండి చూసుకుంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా కెప్టెన్ గా ఉన్నవారు తనకు ఒక డిప్యూటీని నియమించుకొని.. ఇక ఆ ఇద్దరే చివరికి హౌస్ మొత్తాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే గతవారం టాస్కులలో విజయం సాధించిన శోభ శెట్టి.. కెప్టెన్సీ అందుకుంది అన్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు శోభా శెట్టి కెప్టెన్సీ పై మాత్రం విమర్శలు వస్తున్నాయి. శోభ అఫీషియల్ గా కెప్టెన్ అయినప్పటికీ హౌస్ కి ఇక సీరియల్ బ్యాచ్ అని పేరున అమర్ దీప్, ప్రియాంకలు కూడా కెప్టెన్సీ అందుకున్నారూ అన్నది స్పష్టమవుతుంది.
ఎందుకంటే కెప్టెన్ గా అందరికీ అన్ని చెప్పాల్సిన శోభా శెట్టి.. ఇక హౌస్ లో ఎవరికి ఏం పనులు అప్పగించాలి అనే విషయాన్ని అమరదీప్, ప్రియాంక చెబుతూ ఉంటే వింటుంది. అయితే ఆటల్లో ఈ ముగ్గురు కలిసే ఆడుతారు. హౌస్ లో ఉన్నప్పుడు కలిసి ఉంటారు. కనీసం కెప్టెన్సీ అయినా కొంచెం ఫెయిర్‌గా చేయండి రా అంటే ఇక ఈ ముగ్గురు హౌస్ కి ఒకేసారి కెప్టెన్ అయ్యారు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇదే విషయంపై అర్జున్ కూడా ఒకరు కెప్టెన్ అయినట్టు లేదు ముగ్గురు కెప్టెన్ అయినట్లు ఉంది అంటూ కామెంట్ కూడా చేయడం గమనార్హం. దీంతో ఇక శోభాశెట్టికి ఈ వీక్ లో వరస్ట్ కెప్టెన్ అనే ట్యాగ్ రావడం ఖాయం అని అందరూ భావిస్తున్నారు.