అక్కడ రీమేక్ కి సిద్ధం అవుతున్న బేబీ.. సక్సెస్ అవుతుందా..?

Divya
సాయి రాజేష్ దర్శకత్వం లో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య నటీనటులుగా కీలక పాత్ర పోషించిన చిత్రం బేబీ.. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి భారీగా విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ వసూల్ చేసి సరికొత్త రికార్డు సృష్టించడమే కాదు.. నటీ నటుల కు కూడా ఊహించని రీతిలో గుర్తింపును అందించింది. జూలై 2023లో వచ్చిన ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద సినిమాలకు పోటీ గా నిలిచి భారీ కలెక్షన్స్ వసూలు చేసి.. నిర్మాతలకు లాభాలు అందించింది.

ఇకపోతే ఏ సినిమా పరిశ్రమలో అయినా ఒక సినిమా మంచి విజయాన్ని సాధించింది అంటే ఖచ్చితంగా ఆ సినిమాను ఇతర భాషలలో రీమేక్ చేయడానికి దర్శక నిర్మాతలు, నటీ నటులు ఆశక్తి చూపిస్తూ ఉంటారు. లేదా అదే సినిమా కాస్టింగ్ తో రీమేక్ చేస్తూ వుంటారు. ఈ క్రమంలోనే తెలుగులో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ను ఇప్పుడు హిందీ లో రీమేక్ చేయడానికి సిద్ధం అవుతున్నారు తెలుగు బేబీ మూవీ నిర్మాతలు అల్లు అరవింద్, బేబీ నిర్మాత SKN.

తాజాగా ఈ వార్తలు బాగా వైరల్ అవుతున్న నేపథ్యంలో బేబీ చిత్ర బృందం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాజాగా కోటబొమ్మాళి PS చిత్రం కోసం విలేకరుల సమావేశంలో పాల్గొన్న నిర్మాత అల్లు అరవింద్, బేబీ నిర్మాత SKN.. బేబీ సినిమాను హిందీ లో రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఈ సినిమాలో తారాగణం, సాంకేతిక నిపుణులు, దర్శకుడు ఎవరు అన్న విషయం పై క్లారిటీ ఇవ్వలేదు. చూడాలి మరి అదే తారాగణం హిందీ లో కూడా నటిస్తారా లేక బాలీవుడ్ యాక్టర్స్ నే తీసుకుంటారా అని.. మరి తెలుగులో ఇంత సక్సెస్ అయిన ఈ సినిమా హిందీ లో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: